AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందరి అంచనాలు తలకిందులు…సోమవారం సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం..!

బీహార్​ ముఖ్యమంత్రిగా నితీశ్​కుమార్​ వచ్చే వారంలో ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. సోమవారమే ఈ వేడుక ఉంటుందని జేడీయూ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 16న 'భాయ్ దూజ్​' పండుగ సందర్భంగా నితీశ్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని...

అందరి అంచనాలు తలకిందులు...సోమవారం సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం..!
Sanjay Kasula
|

Updated on: Nov 12, 2020 | 8:32 PM

Share

బీహార్​ ముఖ్యమంత్రిగా నితీశ్​కుమార్​ వచ్చే వారంలో ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. సోమవారమే ఈ వేడుక ఉంటుందని జేడీయూ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 16న ‘భాయ్ దూజ్​’ పండుగ సందర్భంగా నితీశ్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనున్నారు.

అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనను జేడీయూ ఇంత వరకు చేయలేదు. అయితే   తమకు కూడా ఎలాంటి సమాచారం అందలేదని బిహార్​ రాజ్​భవన్​ వెల్లడించింది.

2020 బీహార్​ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసిన ఎన్​డీఏ.. మరోసారి నితీశ్ కుమార్‌కే పట్టం కట్టాలని అనుకుంటోంది. దీంతో వరుసగా నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించింన ఘనత నితీశ్ ఖాతాలో పడుతుంది.

బీహార్ ముఖ్యమంత్రి పీఠంపై ఏర్పడిన సందిగ్ధతపై భారతీయ జనతా పార్టీ క్లారిటీ ఇచ్చింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయేకు స్పష్టమైన మెజారిటీ వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి విషయంలో కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

సిట్టింగ్ సీఎం నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ కంటే బీజేపీ దాదాపు 31 సీట్లను అధికంగా సాధించింది. గతంలో జేడీయూకు ఎక్కువ సీట్లు.. బీజేపీకి తక్కువ సీట్లు వున్నప్పుడు నితీశ్ ముఖ్యమంత్రిగాను.. బీజేపీకి చెందిన సుశీల్ మోదీ ఉప ముఖ్యమంత్రిగాను వ్యవహరించారు. కానీ ఈసారి ఫలితాల్లో నితీశ్ పార్టీ కేవలం 43 సీట్లకు పరిమితమైంది. మోదీ చరిష్మాతో బీజేపీ 74 సీట్లను కైవసం చేసుకుంది. దాంతో ముఖ్యమంత్రి పీఠం బీజేపీ తీసుకుంటుందన్న ప్రచారం జరిగింది. అయితే బీజేపీ అధిష్టానం నితీశ్ కుమార్‌కు మరోసారి అవకాశం ఇవ్వాలని అనుకుంటోందని రాజకీయ విశ్లేషకుల అంచనా.

Follow Us
అమ్మా.. ఇదిగో నా మొదటి జీతం.. తల్లిదండ్రుల రియాక్షన్‌ ఇదే!
అమ్మా.. ఇదిగో నా మొదటి జీతం.. తల్లిదండ్రుల రియాక్షన్‌ ఇదే!
మనుషుల పై ఏఐ తిరగబడనుందా?
మనుషుల పై ఏఐ తిరగబడనుందా?
కాలేజీని వీడినా, బంధాన్ని వీడలేదు.. ఓయూకు పూర్వ విద్యార్థి విరాళం
కాలేజీని వీడినా, బంధాన్ని వీడలేదు.. ఓయూకు పూర్వ విద్యార్థి విరాళం
'నా మృతదేహం పక్కన తారక్‌తో సహా ఆ హీరోలందరూ'.. జగ్గూభాయ్ కామెంట్స్
'నా మృతదేహం పక్కన తారక్‌తో సహా ఆ హీరోలందరూ'.. జగ్గూభాయ్ కామెంట్స్
మామిడి పండ్లు తిన్న తర్వాత తీవ్ర అస్వస్థత.. కాసేపటికే దారుణం!
మామిడి పండ్లు తిన్న తర్వాత తీవ్ర అస్వస్థత.. కాసేపటికే దారుణం!
తొలకరి పలకరింపుతో తడిసిన నేల..ఆరుద్రల పరుగులతో మురిసిన పొలం!
తొలకరి పలకరింపుతో తడిసిన నేల..ఆరుద్రల పరుగులతో మురిసిన పొలం!
ఇంట్లో ఈవీ ఛార్జర్‌ను ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?
ఇంట్లో ఈవీ ఛార్జర్‌ను ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?
స్విట్జర్లాండ్ ఫుట్‌బాల్ జట్టు పై పగబట్టిన పాములు
స్విట్జర్లాండ్ ఫుట్‌బాల్ జట్టు పై పగబట్టిన పాములు
వాటర్ పంపుల వద్ద వింత శబ్ధాలు.. భయంతో వణికిన సిబ్బంది
వాటర్ పంపుల వద్ద వింత శబ్ధాలు.. భయంతో వణికిన సిబ్బంది
ప్యాంట్ జేబులో ఉండగా ఒక్కసారిగా పేలిపోయిన ఫోన్.. ఇదిగో వీడియో
ప్యాంట్ జేబులో ఉండగా ఒక్కసారిగా పేలిపోయిన ఫోన్.. ఇదిగో వీడియో