బీహారీ ‘బాద్ షా’, నితీష్ కుమార్, ఎన్డీయే లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నిక, నాలుగోసారీ సీఎం కుర్చీ !

| Edited By: Pardhasaradhi Peri

Nov 15, 2020 | 3:09 PM

బీహార్ సీఎం గా జేడీ-యూ అధినేత నితీష్ కుమార్ మళ్ళీ-నాలుగోసారి కూడా ముఖ్య మంత్రి పీఠాన్ని ఎక్కనున్నారు.  ఆదివారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు పాట్నాలో జరిగిన సమావేశంలో..

బీహారీ బాద్ షా, నితీష్ కుమార్, ఎన్డీయే లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నిక, నాలుగోసారీ సీఎం కుర్చీ !
Follow us on

బీహార్ సీఎం గా జేడీ-యూ అధినేత నితీష్ కుమార్ మళ్ళీ-నాలుగోసారి కూడా ముఖ్య మంత్రి పీఠాన్ని ఎక్కనున్నారు.  ఆదివారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు పాట్నాలో జరిగిన సమావేశంలో ఎన్డీయే లెజిస్లేచర్ పార్టీ నేతగా ఆయనను ఎన్నుకున్నారు. ఆయన తమ సీఎం అభ్యర్థి అని బీజేపీ ఇదివరకే ప్రకటించిన విషయం గమనార్హం. ఇటీవలి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ-యూ తక్కువ స్థానాలను గెలుచుకున్నప్పటికీ ఎన్డీయే విజయదుంభి మోగించింది. తేజస్వి యాదవ్ఆధ్వర్యంలోని ఆర్జేడీ ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే బీహార్ కొత్త ముఖ్యమంత్రి నితీష్ కుమారేనని బీజేపీ నేతలు ప్రకటించారు. ఆయన ఈ నెల 16 న సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారని వార్తలు వఛ్చిన వేళ..ఆదివారం ‘దీపావళి కానుక’ గా ఎన్డీయే ఆయనను లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నుకోవడం విశేషం.