Nitiin’s Bheeshma Movie: ‘భీష్మ’.. తొలిరోజు రికార్డు వసూళ్లు సాధించాడుగా..

|

Feb 23, 2020 | 6:12 AM

'భీష్మ' చిత్రంతో నితిన్ తాజాగా థియేటర్ల దగ్గర సందడి చేస్తున్నాడు. నిన్న విడుదలైన ఈ మూవీ ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీనితో ఈ సినిమా మొదటి రోజు రికార్డు కలెక్షన్స్ రాబట్టింది.

Nitiins Bheeshma Movie: భీష్మ.. తొలిరోజు రికార్డు వసూళ్లు సాధించాడుగా..
Follow us on

Nitiin’s Bheeshma Movie: ‘భీష్మ’ చిత్రంతో నితిన్ తాజాగా థియేటర్ల దగ్గర సందడి చేస్తున్నాడు. నిన్న విడుదలైన ఈ మూవీ ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీనితో ఈ సినిమా మొదటి రోజు రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సుమారు 6.4 కోట్ల షేర్‌ను కొల్లగొట్టింది. నితిన్ కెరీర్‌లోనే సెకండ్ హ్యయెస్ట్ ఫస్ట్ డే వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీ కృష్ణా డిస్ట్రిక్ట్‌లో 40.36 లక్షలు, వైజాగ్‌లో  62 లక్షలు, నైజాంలో 2.21 కోట్లు కొల్లగొట్టింది.

ఇక ఈ వసూళ్లు ఇవాళ, రేపు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా.. మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు.

Also Read: Is Vijay’s Hero Movie Shelved