‘టూ నైట్స్ అండ్ త్రీ డేస్’ నిత్యానంద బంపరాఫర్.. వచ్చేవాళ్లను ఫ్రీగా, హ్యాపీగా చార్టెడ్ ఫ్లైట్‌లో తీసుకెళ్తారట.!
టూ నైట్స్ అండ్ త్రీ డేస్. వచ్చేవాళ్లను తన వెంట తీసుకెళ్తానంటున్నారు నిత్యానందస్వామి. జేబులో నుంచి పైసా తీయ్యక్కర్లేదు. హ్యాపీగా చార్టెడ్ ఫ్లైట్‌లో జర్నీ చేయొచ్చు...
టూ నైట్స్ అండ్ త్రీ డేస్. వచ్చేవాళ్లను తన వెంట తీసుకెళ్తానంటున్నారు నిత్యానందస్వామి. జేబులో నుంచి పైసా తీయ్యక్కర్లేదు. హ్యాపీగా చార్టెడ్ ఫ్లైట్‌లో జర్నీ చేయొచ్చు. ఎకామిడేషన్ అంతా ఆయనే చూసుకుంటాడు. జస్ట్ మీరు వీసాకు అప్లై చేస్తే చాలు. మిగతాదందా ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఇదేదో హాలీడే ట్రిప్ కోసం ఏదో కంపెనీ ఇచ్చే బంపరాఫర్ కాదు. నిత్యానందుల వారి ఆధ్యాత్మిక విహార యాత్ర. ఇంతకీ నిత్యానంద ఆ మూడు రోజులు ఎక్కడి తీసుకెళ్తారో తెలుసా ? మీకు శివుడ్ని చూపించడానికి. అవును నేరుగా కైలాసానికే టిక్కెట్ ఇచ్చేస్తున్నాడు. అంటే ప్రాణాలు పోతాయని భయపడొద్దు. గతంలో కైలాస ద్వీపం పేరుతో ఓ కొత్త దేశాన్ని తాను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పాడు గుర్తుందా… సరిగ్గా అక్కడికే మిమ్మల్ని తీసుకెళ్తాడట. అయితే, ఇక్కడే ఓ తిరకాసు ఉంది. ఇండియా నిత్యానంద కోసం గాలిస్తోంది. ఇక్కడికి ఆయనొచ్చినా, ఆయన ఫ్లైటొచ్చినా.. కైలాసం కాదు, మన పోలీసులు శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తారు. సో కండిషన్ ఏంటంటే.. మీ సొంత ఖర్చులతో ఆస్ట్రేలియా వరకు చేరుకుంటే… అక్కడి నుంచి అంతా నాదే బాధ్యత అంటున్నాడు నిత్యానంద. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు ఈమెయిల్ చేయండి అంటున్నారు. ఎవ్వరైనా మూడు రోజులకు మించి కైలాసంలో ఉండడం కుదరదంట. అంతేకాదు ఈ మూడు రోజుల్లో ఓరోజు నేరుగా ఆ పరమేశ్వుడితోపాటు, తనను దర్శించుకునే అవకాశం కల్పిస్తానంటున్నాడు నిత్యానంద. ఇవాళ్టి నుంచి కైలాస వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చట. ఆస్ట్రేలియా నుంచి కైలాస యాత్ర కోసం చార్టెడ్ ఫ్లైట్స్ సర్వీసులు అందుబాటులో ఉంటాయట. మూడు రోజుల కంటే ఎక్కువ రోజులు వీసా దొరకదు. ఎవరికైనా కైలాసలో కేవలం మూడు రోజుల మాత్రమే బస ఉంటుందని ప్రకటించారు నిత్యానందస్వామి.