లాలూ ప్రసాద్ భద్రత సిబ్బందికి కరోనా

|

Aug 21, 2020 | 2:42 PM

లాలూ ప్రసాద్ అనారోగ్యానికి గురై రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లాలూకు భద్రతగా ఉన్న 9 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

లాలూ ప్రసాద్ భద్రత సిబ్బందికి కరోనా
Follow us on

ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌కు భద్రతగా ఉన్న 9 మంది సెక్యూరిటీ సిబ్బందికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. దాణా స్కాంలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లాలూకు భద్రతగా ఉన్న 9 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. లాలూకు చికిత్స చేస్తున్న రిమ్స్ వైద్యుడు ఉమేశ్ ప్రసాద్ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు.

దీంతో వారికి కరోనా చికిత్స అందించేందుకు పంపించామని వైద్యులు తెలిపారు. వారి స్థానంలో 9 మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయాలని సంబంధిత పోలీసు అధికారులను రిమ్స్ కోరినట్లు ఉమేశ్ ప్రసాద్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో లాలూ ప్రసాద్ కు కూడా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. అయితే ఫలితం ఏమిటన్నది ఇంకా వెల్లడించలేదు. లాలు గత కొన్నేండ్లుగా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.