మధ్యప్రదేశ్‌ సర్కార్ మరో కీలక నిర్ణయం.. రాత్రుళ్లు కర్ఫ్యూ విధించిన సీఎం చౌహాన్.. వారికి మాత్రం మినహాయింపు..

|

Nov 20, 2020 | 8:58 PM

మరోసారి దేశవ్యప్తంగా కరోనా కలవరపెడుతోంది. రెండో విడత తన ప్రతాపాన్ని చూపుతోంది వైరస్. దీంతో ప్రభుత్వాలు మరోసారి నియంత్రణ చర్యలకు సిద్ధమవుతున్నాయి.

మధ్యప్రదేశ్‌ సర్కార్ మరో కీలక నిర్ణయం.. రాత్రుళ్లు కర్ఫ్యూ విధించిన సీఎం చౌహాన్.. వారికి మాత్రం మినహాయింపు..
Follow us on

మరోసారి దేశవ్యప్తంగా కరోనా కలవరపెడుతోంది. రెండో విడత తన ప్రతాపాన్ని చూపుతోంది వైరస్. దీంతో ప్రభుత్వాలు మరోసారి నియంత్రణ చర్యలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో పలు విధాలైన ఆంక్షలు విధించినట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది. తాజా మధ్యప్రదేశ్‌ సర్కార్ అదే బాటలో పయనిస్తోంది. కరోనా కట్టడి చర్యలకు ఉపక్రమిస్తోంది. అయితే, రాష్ట్రం మొత్తం కాకుండా ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాలపై అంక్షలు అమలు చేయాలని నిర్ణయించింది.

ముఖ్యంగా ఇండోర్, భోపాల్, గ్వాలియర్, విధిష, రాట్లం జిల్లాల్లో రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ విధించబోతున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. నవంబర్ 21 అర్థరాత్రి నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అత్యవసర సేవల విభాగంలో పని చేస్తున్న వారికి, ఫ్యాక్టరీల్లో పని చేస్తున్న కార్మికులకు ఈ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు శివరాజ్ సింగ్ తెలిపారు. కాగా, రాష్ట్రంలో మరోపారి కరోనా వైరస్ విరుచుకుపడే అవకాశముందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు కచ్చితంగా ధరించాలన్నారు సీఎం.