నగర శివారులలో ఎన్ఐఏ సోదాలు

హైదరాబాద్ నగరంలో ఎన్ఐఏ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఉగ్రకదలికల నేపథ్యంలో నగర శివారులలో ఉన్న మైలార్‌దేవ్‌పల్లిలోని ఎనిమిది ఇళ్లల్లో శనివారం ఉదయం 8 గంటలనుంచి సోదాలు జరుగుతున్నాయి. స్థానిక కింగ్స్ ప్యాలెస్ నగర్‌లో ఉన్న తాహిర్ అనే యువకుడిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. సోదాల సందర్భంగా తాహీర్‌ను మూడు గంటల పాటు విచారించారు. గతంలో ఎన్ఐఏ అరెస్ట్ చేసిన బాసిత్, అబ్దుల్ ఖాదిర్‌ అనే ఉగ్రవాదులు ఇచ్చిన సమాచారంతోనే ఈ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన […]

నగర శివారులలో ఎన్ఐఏ సోదాలు

Edited By:

Updated on: Apr 20, 2019 | 12:44 PM

హైదరాబాద్ నగరంలో ఎన్ఐఏ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఉగ్రకదలికల నేపథ్యంలో నగర శివారులలో ఉన్న మైలార్‌దేవ్‌పల్లిలోని ఎనిమిది ఇళ్లల్లో శనివారం ఉదయం 8 గంటలనుంచి సోదాలు జరుగుతున్నాయి. స్థానిక కింగ్స్ ప్యాలెస్ నగర్‌లో ఉన్న తాహిర్ అనే యువకుడిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. సోదాల సందర్భంగా తాహీర్‌ను మూడు గంటల పాటు విచారించారు. గతంలో ఎన్ఐఏ అరెస్ట్ చేసిన బాసిత్, అబ్దుల్ ఖాదిర్‌ అనే ఉగ్రవాదులు ఇచ్చిన సమాచారంతోనే ఈ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన బాసిత్.. ఐసిస్ సానుభూతి పరుడు. ఐసిస్‌లో చేరేందుకు సిరియా, పాకిస్థాన్ కూడా వెళ్లొచ్చాడు. ఆ తర్వాత ఐసిస్ ఆదేశాలతో ఢిల్లీకి చెందిన ఆర్ఎస్ఎస్ నేతను అంతం చేయడానికి ప్లాన్ చేశాడు. తనతో పాటు మరో నలుగురు యువకులను ఢిల్లీకి తీసుకువెళ్లాడు. ఏకే 47లు కూడా సమకూర్చుకున్నాడు. అయితే ఈ కుట్రను ఎన్ఐఏ భగ్నం చేసింది. అతడి అరెస్ట్ నేపథ్యంలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాసిత్‌కు పాక్ యువతితో సంబంధాలు ఉన్నట్టు అతడి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వారిద్దరి మధ్య జరిగిన చర్చ ద్వారా ప్రస్తుతం ఎన్ఐఏ నగరంలో సోదాలు నిర్వహిస్తోంది. తాహిర్ ఇంటి నుంచి కీలక పత్రాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది.