బోరబండలో భయం భయం… రంగంలోకి ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు

|

Oct 04, 2020 | 12:48 PM

హైదరాబాద్ బోరబండలో శుక్రవారం రాత్రి పలుమార్లు సంభవించిన భూ ప్రకంపనలపై ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు లోతుగా పరీక్షిస్తున్నారు. ఇందుకోసం సైంటిస్టులు బోరబండలో ఆదివారం పర్యటించారు. మళ్లీ భూప్రకంపనలు కనుక వస్తే వాటి తీవ్రతను గుర్తించడానికి వీలుగా సిస్మో గ్రాఫ్ లను ఏర్పాటు చేసే ప్రాంతాల్లో పర్యటించారు. భూమినుంచి వస్తున్న శ‌బ్దాల తీవ్రత‌ను గుర్తించేందుకు బోర‌బండ డివిజ‌న్‌లోని నాట్కో స్కూల్‌, సాయిబాబా న‌గ‌ర్‌లోని క‌మ్యూనిటీహాల్‌, ఎన్‌.ఆర్‌.ఆర్ పురంలోని సైట్‌-4, 5 మ‌ధ్య సిస్మోగ్రాఫ్‌ల‌ు ఏర్పాటు చేశారు. భూమి నుంచి వస్తున్న […]

బోరబండలో భయం భయం... రంగంలోకి ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు
Follow us on

హైదరాబాద్ బోరబండలో శుక్రవారం రాత్రి పలుమార్లు సంభవించిన భూ ప్రకంపనలపై ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు లోతుగా పరీక్షిస్తున్నారు. ఇందుకోసం సైంటిస్టులు బోరబండలో ఆదివారం పర్యటించారు. మళ్లీ భూప్రకంపనలు కనుక వస్తే వాటి తీవ్రతను గుర్తించడానికి వీలుగా సిస్మో గ్రాఫ్ లను ఏర్పాటు చేసే ప్రాంతాల్లో పర్యటించారు. భూమినుంచి వస్తున్న శ‌బ్దాల తీవ్రత‌ను గుర్తించేందుకు బోర‌బండ డివిజ‌న్‌లోని నాట్కో స్కూల్‌, సాయిబాబా న‌గ‌ర్‌లోని క‌మ్యూనిటీహాల్‌, ఎన్‌.ఆర్‌.ఆర్ పురంలోని సైట్‌-4, 5 మ‌ధ్య సిస్మోగ్రాఫ్‌ల‌ు ఏర్పాటు చేశారు. భూమి నుంచి వస్తున్న శ‌బ్దాల‌కు గ‌ల కార‌ణాల‌ను ఎన్ జి ఆర్ ఐ అధికారులు విశ్లేషిస్తున్నారు. భ‌య‌బ్రాంతుల‌కు గురికావ‌ద్దని బోరబండ వాసులకు సూచించారు.

ఇలా ఉంటే, బ్రతుకు భయంతో బోరబండ వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పుడు పగలు కూడా శబ్దాలు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. రాత్రయితే చాలు కంటిమీద కునుకు లేకుండా పోతుందని వాపోతున్నారు. నిన్న రాత్రంతా పిల్లలతో ఆరుబయటే నిద్రించామని చెబుతున్నారు. శనివారం రాత్రి కూడా శబ్దాలు వచ్చాయని తెలిపారు. ఒక్క శుక్రవారంనాడు 26 సార్లు భూప్రకంపనలు వచ్చాయని స్థానికులు అంటున్నారు.