గురువు కేసీఆర్ ఆశీస్సులు కావాలి, తిరుమలలో బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్

|

Nov 11, 2020 | 3:23 PM

విద్య నేర్పిన గురువుతోనే పోటీపడితే బాగుంటుందనీ, నేను గురువుగా భావించిన కేసీఆర్ నుండి ఆశీస్సులు లభిస్తాయని భావిస్తున్నాని అన్నారు దుబ్బాక ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా ఎన్నికైన రఘునందన్ రావు. విజయానంతరం ఆయన నేరుగా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేశారు. ముందుగా స్వామివారికి తలనీలాలు సమర్పించి అనంతరం సుపథం ఎంట్రీ ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం బయట మీడియాతో మాట్లాడుతూ దుబ్బాకలో బీజేపీ విజయం దక్షణాది రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం చూపుతుందని తెలిపారు. తన విజయం పార్టీ […]

గురువు కేసీఆర్ ఆశీస్సులు కావాలి, తిరుమలలో బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్
Follow us on

విద్య నేర్పిన గురువుతోనే పోటీపడితే బాగుంటుందనీ, నేను గురువుగా భావించిన కేసీఆర్ నుండి ఆశీస్సులు లభిస్తాయని భావిస్తున్నాని అన్నారు దుబ్బాక ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా ఎన్నికైన రఘునందన్ రావు. విజయానంతరం ఆయన నేరుగా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేశారు. ముందుగా స్వామివారికి తలనీలాలు సమర్పించి అనంతరం సుపథం ఎంట్రీ ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం బయట మీడియాతో మాట్లాడుతూ దుబ్బాకలో బీజేపీ విజయం దక్షణాది రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం చూపుతుందని తెలిపారు. తన విజయం పార్టీ సమిష్టి కృషికి నిదర్శనంగా పేర్కొన్నారు. పార్టీకి అన్నీ విధాల సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు. ప్రజాసేవ చేయాలనే తపనే ముఖ్యమంత్రి గడ్డపై తనను గెలిపించిందన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే దుబ్బాక నియోజక వర్గాన్ని అగ్రగామిగా నిలిపేందుకు శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించానని తెలియజేశారు.