స్ట్రెయిన్‌తో శంషాబాద్, గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌లో అప్రమత్తం, బ్రిటన్‌ నుంచి వచ్చిన వాళ్లు సమాచారం ఇవ్వాలని విన్నపం

స్ట్రెయిన్‌తో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. కొత్త వైరస్‌ నేపథ్యంలో అలజడి మొదలైంది. ఇప్పటికే భారత్‌.. బ్రిటన్‌ నుంచి వచ్చే విమానాలను..

  • Venkata Narayana
  • Publish Date - 2:26 pm, Wed, 23 December 20
స్ట్రెయిన్‌తో శంషాబాద్, గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌లో అప్రమత్తం, బ్రిటన్‌ నుంచి వచ్చిన వాళ్లు సమాచారం ఇవ్వాలని విన్నపం

స్ట్రెయిన్‌తో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. కొత్త వైరస్‌ నేపథ్యంలో అలజడి మొదలైంది. ఇప్పటికే భారత్‌.. బ్రిటన్‌ నుంచి వచ్చే విమానాలను రద్దు చేసింది. అక్కడ నుంచి వచ్చిన వారిలో 25 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. జన్యుమార్పిడి చెందిన వైరస్‌ కావొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. బ్రిటన్‌ నుంచి వచ్చిన వారికి పరీక్షలు చేయనుంది ప్రభుత్వం. కాగా, కొత్త రకం వైరస్‌పై ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్రం. ఈ నేపథ్యంలో ఇటు శంషాబాద్, అటు గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌లో అప్రమత్తం చేశారు. ఎయిర్‌ పోర్ట్‌లో దిగుతున్న వారిని ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. వారం రోజుల్లో బ్రిటన్‌ నుంచి 3 వేల మంది తెలంగాణకు వచ్చారు, వారికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.

యూకే నుంచి వచ్చినవారు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలన్నారు. ఇప్పటికే ఇద్దరిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. కొత్త వైరస్‌ నిర్ధారణ కోసం నమూనాలను పుణె పంపారు అధికారులు. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 9 వరకు వచ్చిన వారు ఇంట్లో క్వారంటైన్‌లో ఉండాలి. ఆ తర్వాత వచ్చిన వారు కచ్చితంగా RTPCR టెస్ట్ చేయించుకోవాలి. పాజిటివ్ వచ్చిన వారు టిమ్స్ వెళ్లాల్సి ఉంటుంది. ప్రైమరీ కాంటాక్ట్స్‌ను నేచర్ క్యూర్ హాస్పిటల్‌లో ఉంచి ఆబ్జర్వ్ చేస్తున్నారు. మూడు వేల మందికి యాంటీజెన్ నిర్వహించబోతున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో అలర్ట్‌గా ఉండాలని వైద్యాధికారులను ఆదేశించారు సీఎం జగన్‌. బ్రిటన్‌ సహా కొన్ని దేశాల్లో ఆంక్షలు విధించారు.. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. కరోనా వైరస్‌తోపాటు వ్యాక్సిన్‌ పంపిణీ ఏర్పాట్లపై ఆరా తీశారు.