Motorola update: మోటోరోలా ఫోన్లకు ఆండ్రాయిడ్ 11 అప్డేట్… సర్వీసు ఎప్పటి నుంచి అందుబాటులోకి అంటే…

ఎల్‌జీ ఫోన్లు ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్‌ను విడుదల చేయడం ప్రారంభించింది. ఇదే బాట‌లో మోటోరోలా కూడా అండ్రాయిడ్ 11 అప్‌డేట్ ను అందుకోబోయే స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను ప్రకటించింది

Motorola update: మోటోరోలా ఫోన్లకు ఆండ్రాయిడ్ 11 అప్డేట్... సర్వీసు ఎప్పటి నుంచి అందుబాటులోకి అంటే...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Dec 23, 2020 | 2:34 PM

కొత్త సంవ‌త్సరంలో ఆరంభంలోనే ప‌లు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు త‌మ వినియోగ‌దారుల‌కు సాప్ట్‌వేర్ అప్‌డేట్‌ను అందించ‌నున్నాయి. ఇప్పటికే ఎల్‌జీ ఫోన్లు ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్‌ను విడుదల చేయడం ప్రారంభించింది. ఇదే బాట‌లో మోటోరోలా కూడా అండ్రాయిడ్ 11 అప్‌డేట్ ను అందుకోబోయే స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను ప్రకటించింది. ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్స్‌తో పాటు ఇతర ఫీచర్లను అందించ‌నుంది. 2019, 2020 లో లాంచ్ చేసిన మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌లు ఎక్కువగా ఈ అప్‌డేట్‌ను అందుకోనున్నాయి. ఆండ్రాయిడ్ 11 తో పాటు చాట్ బ‌బుల్స్ తో స‌హా మ‌రెన్నో ఫీచర్లను ఈ అప్‌డేట్ ద్వారా అందించ‌నున్నట్లు మోటోరోలా పేర్కొంటోంది..

మోటోరోలా చాట్ బబుల్స్, స్ట్రీమ్లైన్డ్ డివైస్, మీడియా కంట్రోల్స్ మరియు ఇతర ముఖ్యమైన ప్రైవ‌సీ సెక్యూరిటీ సెట్టింగులతో సహా కొన్ని కొత్త ఫీచర్లను విడుదల చేయ‌నున్నట్లు మోటోరోలా త‌న బ్లాగులో వెల్లడించింది. దీనిని బ‌ట్టి కాబట్టి ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్ అందుకోబోయే అవ‌కాశ‌మున్న మోటోరోలా ఫోన్ల జాబితా ఇదే…

motorola razr 5G motorola razr 2019 motorola edge motorola edge+ motorola one 5G motorola one action motorola one fusion motorola one fusion+ motorola one hyper motorola one vision moto g 5G moto g 5G plus moto g fast moto g power moto g pro moto g stylus moto g9 moto g9 play moto g9 plus moto g9 power moto g8 moto g8 power Lenovo K12 Note పైన పేర్కొన్న చాలా స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం మ‌న‌దేశంలో అందుబాటులో లేవు. ఈ లిస్టులో మోటోరోలా రేజర్ 5జి, మోటోరోలా రేజర్ 2019, మోటోరోలా ఎడ్జ్, మోటోరోలా ఫ్యూజన్ +, మోటో జీ 5జీ, మోటో జీ9, మోటో జీ9 పవర్ వంటి స్మార్ట్‌ఫోన్లు ప్రస్తుతం ఇండియాలో ఉన్నాయి.