మైక్రోచిప్, ఎన్‌ఎఫ్‌సీ వంటి ప్రత్యేకతలతో కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్‌సీలు

కేంద్ర ప్రభుత్వం ఇండియన్ యూనియన్ డ్రైవింగ్ లైసెన్స్, ఇండియన్ యూనియన్ వెహికల్ రిజిస్ట్రేషన్ పేరుతో దేశవ్యాప్తంగా ఒకేరకమైన విధానాన్ని అమలులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఇందులో భాగంగా సరికొత్త ఆర్‌సీలను, డ్రైవింగ్ లైసెన్స్‌ కార్డులను జారీ చేయనుంది. 1 అక్టోబర్ 2019 నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆర్‌సీ, డ్రైవింగ్ లైసెన్స్‌కు ఒకే నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. […]

మైక్రోచిప్, ఎన్‌ఎఫ్‌సీ వంటి ప్రత్యేకతలతో కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్‌సీలు
Follow us

| Edited By:

Updated on: Mar 13, 2019 | 3:58 PM

కేంద్ర ప్రభుత్వం ఇండియన్ యూనియన్ డ్రైవింగ్ లైసెన్స్, ఇండియన్ యూనియన్ వెహికల్ రిజిస్ట్రేషన్ పేరుతో దేశవ్యాప్తంగా ఒకేరకమైన విధానాన్ని అమలులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఇందులో భాగంగా సరికొత్త ఆర్‌సీలను, డ్రైవింగ్ లైసెన్స్‌ కార్డులను జారీ చేయనుంది. 1 అక్టోబర్ 2019 నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆర్‌సీ, డ్రైవింగ్ లైసెన్స్‌కు ఒకే నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది.

కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌లలో అడ్వాన్స్‌డ్ మైక్రోచిప్ ఉంటుంది. వీటికి శీఘ్ర ప్రతిస్పందన…క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్) కోడ్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్‌ఎఫ్‌సీ) వంటి ప్రత్యేకతలుంటాయి. కొత్త టెక్నాలజీ వల్ల డ్రైవర్లకు సంబంధించిన వివరాలు, పెనాల్టీలు సెంట్రలైజ్‌డ్ ఆన్‌లైన్ డేటాబేస్‌లో పదేళ్లపాటు నిక్షిప్తమై ఉంటాయి. ఒకవేళ దివ్యాంగులైతే వారి కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వాహనం ఉంటే ఆ వివరాలను కూడా కార్డుపై ముద్రిస్తారు. ఆర్‌సీలకు కూడా ఇదే టెక్నాలజీ వర్తిస్తుంది.