ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. కరోనా కట్టడిలో భాగంగా భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అయ్యింది. అలాగే ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం జీవితంలో ఒక భాగంగా మారింది. వైరస్ సోకకుండా రకరకాల మాస్కులను తయారు చేసుకుంటూ వినియోగిస్తున్నారు. మరోవైపు మాస్కుల నాణ్యత సరిగా లేక కరోనా అంటుకుంటుందని వైద్యులు చెబుతున్నారు. తాజాగా రెండు ఫిల్టర్లున్న కొత్తరకం మాస్క్‌తో శనివారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో దర్శనిమిచ్చింది. ఈ ఉత్సవాలకు హాజరైన విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్యకళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.వి.సుధాకర్ ధరించి రావడం అందరిని ఆకర్షించింది.
హాఫ్ ఫేస్ పీస్‌గా పిలిచే ఈ మాస్క్ అసలు పేరు క్లినికల్ కెమికల్ ఫ్యూమ్ రెస్పిరేటరీ మాస్కు. దీన్ని ధరించడంలో కొంత అసౌకర్యం ఉన్నా.. పూర్తి రక్షణాత్మకమైనదని సుధాకర్ తెలిపారు. దీనికి రెండు వైపులా ఉన్న ఫిల్టర్లు వైరస్ వ్యాపించకుండా అరికడుతుందంటున్నారు సుధాకర్. ఈ మాస్క్ ను నెల రోజులపాటు ఏకధాటిగా వాడొచ్చంటున్నారు. నెల తర్వాత కొత్తవి అమర్చుకోవాలని సూచిస్తున్నారు. అమెరికా నుంచి సన్నిహితులు పంపారని, దేశీయ మార్కెట్‌లో దీని ధర రూ.6 వేల వరకు ఉంటుందని సుధాకర్ వివరించారు.