AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గొర్రెకుంట మరణాల కేసులో మరో ట్విస్ట్.. మృతదేహాల ఒంటిపై గాయాలు!

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొర్రెకుంట మరణాల కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతుంది. తొమ్మిది మంది వలస కార్మికులది హత్యా? లేక ఆత్మహత్యా? హత్య అయితే చేసిందెవరు? ఆత్మహత్య అయితే కారణాలు ఏంటి? ఇలా ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలకు సమాధానాల కోసం పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే తాజాగా ఫోరెన్సిక్ రిపోర్టులో మరిన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. బావిలో నీరు ఊపిరితిత్తుల్లోకి చేరడం వల్ల అందరూ చనిపోయారని ఫోరెన్సిక్ వైద్యులు తెలిపారు. అంతేకాక మూడేళ్ల బాలుడు మినహా మిగిలిన […]

గొర్రెకుంట మరణాల కేసులో మరో ట్విస్ట్.. మృతదేహాల ఒంటిపై గాయాలు!
Ravi Kiran
|

Updated on: May 24, 2020 | 3:52 PM

Share

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొర్రెకుంట మరణాల కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతుంది. తొమ్మిది మంది వలస కార్మికులది హత్యా? లేక ఆత్మహత్యా? హత్య అయితే చేసిందెవరు? ఆత్మహత్య అయితే కారణాలు ఏంటి? ఇలా ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలకు సమాధానాల కోసం పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే తాజాగా ఫోరెన్సిక్ రిపోర్టులో మరిన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. బావిలో నీరు ఊపిరితిత్తుల్లోకి చేరడం వల్ల అందరూ చనిపోయారని ఫోరెన్సిక్ వైద్యులు తెలిపారు. అంతేకాక మూడేళ్ల బాలుడు మినహా మిగిలిన ఎనిమిది మంది ఒంటిపై గాయలున్నాయని ఎంజీఎం ఫోరెన్సిక్ హెడ్ డాక్టర్ రజామాలిక్ వెల్లడించారు.

సంఘటనా స్థలంలో మత్తు టాబ్లెట్స్, కూల్ డ్రింక్స్ పోలీసులకు లభ్యమయ్యాయని.. వారికి కూల్ డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చిన తరువాత గోనె సంచుల్లో ఈడ్చుకుంటూ వెళ్ళి బావిలో పడేసి ఉంటారని భావిస్తున్నట్లు వైద్యులు వివరించారు. ఈ తతంగం మొత్తం మక్సూద్ ఇంటి వద్దనే జరిగి ఉండవచ్చునని వారు అన్నారు. ఈ సంఘటనలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ప్రమేయం ఉన్నట్టు స్పష్టమౌతోంది.. ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తేనే అసలు నిజాలు నిర్దారణ అవుతాయని డాక్టర్ రజామాలిక్ స్పష్టం చేశారు.

మరోవైపు తొమ్మిది మరణాల మిస్టరీని ఛేదించేందుకు క్లూస్ టీమ్స్, ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సామూహిక మరణాలు జరిగిన బావితో పాటు సంఘటనా స్థలంలో పలు కీలక ఆధారాలను సేకరించడంతో పాటు.. గోడౌన్ ఇంట్రెన్స్ గేట్ పక్కన ఉన్న మక్సూద్ గది నుండి గోనె సంచుల్లో ఈడ్చుకుపోయి బావిలో పడేసినట్లు ఉన్న ఆనవాళ్లను కూడా వారు గుర్తించారు.

కాగా, ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు మహ్మద్‌ మక్సూద్‌ ఆలం కూతురు బుష్రా ఖాటూన్‌, ప్రియుడు యాకూబ్‌తో పాటు బీహార్‌కు చెందిన కార్మికులు సంజయ్‌ కుమార్‌ యాదవ్, మంకుషాలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంతేకాక శనివారం వరంగల్‌కు చెందిన మరో ఇద్దరిని కూడా పట్టుకున్నట్లు సమాచారం. వారి నుంచి రెండు సెల్‌ఫోన్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. ఇక ఈ కేసులో మంకుషా వాంగ్మూలం కీలకంగా మారింది.

ఇది చదవండి: ఏపీలో వాలంటీర్లపై వరుస దాడులు.. తాజాగా మరో రెండు చోట్ల..!