టాటా గ్రూప్ కే కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ కాంట్రాక్ట్

ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ కాంట్రాక్టును టాటా గ్రూప్ దక్కించుకుంది. రూ. 862 కోట్ల వ్యయ ప్రతిపాదనతో ఈ సంస్థ దాఖలు చేసిన బిడ్ ను సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ ఆమోదించింది. బిడ్ లు..

టాటా గ్రూప్ కే కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ కాంట్రాక్ట్

Edited By:

Updated on: Sep 16, 2020 | 7:32 PM

ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ కాంట్రాక్టును టాటా గ్రూప్ దక్కించుకుంది. రూ. 862 కోట్ల వ్యయ ప్రతిపాదనతో ఈ సంస్థ దాఖలు చేసిన బిడ్ ను సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ ఆమోదించింది. బిడ్ లు సమర్పించిన ఇతర కంపెనీల కన్నా ఈ  సంస్థే తక్కువ కోట్ చేసిందని తెలుస్తోంది. ఏడాదిలో కొత్త భవన  నిర్మాణం  పూర్తి కావచ్ఛునని అంటున్నారు. ఈ కాంట్రాక్టును పొందినందుకు తమకు సంతోషంగా ఉందని టాటా గ్రూప్ తెలిపింది. నూతన పార్లమెంట్ భవన నిర్మాణంలో తాము పాలుపంచుకోవడం గర్వంగా ఉందని వెల్లడించింది.

ప్రస్తుత పార్లమెంట్ భవనం కన్నా ఇది మరింత పెద్దదిగా, విశాలంగా ఉండబోతోందని తెలిసింది. ఇప్పటికే దీని నమూనాను టాటా గ్రూప్ పొందింది.