తెలంగాణలో మరో కొత్త మండలం… గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం కేసీఆర్.. మెదక్ జిల్లా తూప్రాన్ రెవెన్యూ డివిజన్‌లో నూతన మండలం

తెలంగాణాలో మరో కొత్త మండలనికి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెదక్ జిల్లా తూప్రాన్ రెవెన్యూ డివిజన్‌లో కొత్తగా మాసాయిపేటను మండలంగా ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ నిర్ణయించారు.

తెలంగాణలో మరో కొత్త మండలం... గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం కేసీఆర్.. మెదక్ జిల్లా తూప్రాన్ రెవెన్యూ డివిజన్‌లో నూతన మండలం

Updated on: Dec 22, 2020 | 4:50 PM

తెలంగాణలో మరో కొత్త మండలనికి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెదక్ జిల్లా తూప్రాన్ రెవెన్యూ డివిజన్‌లో కొత్తగా మాసాయిపేటను మండలంగా మార్చేందుకు కేసీఆర్ నిర్ణయించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు మాసాయిపేటను మండలంగా ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ అంగీకరించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. చేగుంట మండలంలోని 3 గ్రామాలు, యెల్దుర్తి మండలంలోని 6 గ్రామాలు మొత్తంగా 9 గ్రామాలతో మాసాయిపేట మండలాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి ఉత్తర్వులను  త్వరలోనే జారీ చేయనున్నారు.