కొత్త రకం డైనోసార్ మూలాలు క‌నుగొన్న శాస్త్ర‌వేత్త‌లు

సౌతాంప్టన్ విశ్వవిద్యాలయంలోని పాలియోంటాలజిస్టులు గత సంవత్సరం షాంక్లిన్ వద్ద దొరికిన నాలుగు ఎముకలు కొత్త జాతి థెరోపాడ్ డైనోసార్‌కు చెందినవని అభిప్రాయపడ్డారు.

కొత్త రకం డైనోసార్ మూలాలు క‌నుగొన్న శాస్త్ర‌వేత్త‌లు
Follow us
Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 12, 2020 | 7:13 PM

New dinosaur species : సౌతాంప్టన్ విశ్వవిద్యాలయంలోని పాలియోంటాలజిస్టులు గత సంవత్సరం షాంక్లిన్ వద్ద దొరికిన నాలుగు ఎముకలు కొత్త జాతి థెరోపాడ్ డైనోసార్‌కు చెందినవని అభిప్రాయపడ్డారు. స‌ద‌రు జీవి 115 మిలియన్ సంవత్సరాల క్రితం క్రెటేషియస్ కాలంలో నివసించిందని.. 4 మీ (13 అడుగులు) పొడుగు ఉండొచ్చ‌ని అంచనా వేస్తున్నారు. దీనికి వెక్టరోవెనేటర్ ఇనోపినాటస్ అని పేరు పెట్టారు. ఇది టైరన్నోసారస్ రెక్స్ కలిగి ఉన్న డైనోసార్ల సమూహానికి చెందినవిగా భావిస్తున్నారు.

కొన్ని ఎముకలలో కనిపించే పెద్ద గాలి బుడ‌గ‌ల‌పై ప‌రిశోధ‌న చేయ‌డంతో పాటు… జీవి యొక్క మెడ, వెనుక, తోక నుంచి న‌మూనాల‌ను సేక‌రించిన‌ శాస్త్రవేత్తలు దాని థెరపోడ్ మూలాన్ని గుర్తించారు. దీని ఎముక‌ల్లో క‌నిపించిన గాలి బుడ‌గ‌లు తాజాగా కొన్ని ప‌క్షి జాతుల్లో కూడా గుర్తించిన‌ట్టు చెబుతున్నారు. దీని శిలాజాలు 2019 లో మూడు వేర్వేరు ప్ర‌దేశాల‌లో క‌నుగొన్నారు. ప్ర‌స్తుతం శాండౌన్ వద్ద ఉన్న డైనోసార్ ఐల్ మ్యూజియంలోకి వాటిని ప్ర‌ద‌‌ర్శ‌న కోసం ఉంచారు.

Also Read : “12 శాతం వ‌డ్డీతో ఆ జీతాలు చెల్లించండి : ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ జీవోలు ర‌ద్దు”