మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్ సిబ్బంది సహా 23 మందికి కరోనా..!
దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్ సిబ్బంది సహా 23 మందికి కరోనా పాజటివ్‌గా పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య
Coronavirus in Meghalaya: దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్ సిబ్బంది సహా 23 మందికి కరోనా పాజటివ్‌గా పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,165కు చేరింది. తాజా కేసుల్లో ఈస్ట్ ఖాసీ హిల్స్ నుంచి 11 మంది, వెస్ట్‌గారో నుంచి 10 మంది, నార్త్, సౌత్‌గారో హిల్స్ జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున మహమ్మారి బారినపడ్డట్లు హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ అమన్ వార్ పేర్కొన్నారు.
కొత్త రోగులలో పద్దెనిమిది మంది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది – తూర్పు ఖాసి హిల్స్ నుండి ఎనిమిది మంది మరియు వెస్ట్ గారో హిల్స్ నుండి 10 మంది ఉన్నారు. మేఘాలయలో ప్రస్తుతం 642 క్రియాశీల కేసులు ఉండగా, 517 మంది వ్యాధి నుంచి కోలుకోగా, ఆరుగురు మరణించారు. రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌లో భాగమైన ఈస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాలో అత్యధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు 433 ఉన్నాయి. ఇందులో 166 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. తర్వాత 92 రిభోయ్, వెస్ట్‌గారో హిల్స్‌లో 82 కేసులున్నాయని వివరించారు.
Read More: