బిల్ గేట్స్ కి ఎలాంటి మాస్క్ కావాలంటే ?
ఈ కరోనా కాలంలో మాస్క్ లేనిదే బయట కాలు పెట్టలేని పరిస్థితి.. రకరకాల షేపుల్లో వింతయిన మాస్కులు దర్శనమిస్తున్నాయి . కోవిడ్ బారి నుంచి రక్షించుకోవాలంటే ప్రతివ్యక్తికి మాస్కులు..
ఈ కరోనా కాలంలో మాస్క్ లేనిదే బయట కాలు పెట్టలేని పరిస్థితి.. రకరకాల షేపుల్లో వింతయిన మాస్కులు దర్శనమిస్తున్నాయి . కోవిడ్ బారి నుంచి రక్షించుకోవాలంటే ప్రతివ్యక్తికి మాస్కులు అవసరమే. ఎలాంటి మాస్క్ మంచిది, ఏది సురక్షితం అన్న దానిపై వేర్వేరు కథనాలున్నాయి.అయితే కళ్ళు తప్ప ముఖమంతా పూర్తిగా కప్పివేసే మాస్క్ మంచిదన్న అభిప్రాయంతో అంతా ఏకిభవిస్తారు. ఈ మధ్య మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ని ఓ జర్నలిస్టు ..మీకు ఏ తరహా మాస్కులంటే ఇష్టమని ప్రశ్నించగా.. తనకు… చూడముచ్చటగా ఉన్నప్పటికీ, అగ్లీగా (చూడలేనట్టుగా) కూడా ఉన్న నార్మల్ మాస్క్ అంటే ఇష్టమని చమత్కరించారు. అయితే అక్కడితో ఆయన ఆగలేదు. ప్రతిరోజూ తాను మాస్క్ మారుస్తూ ఉంటానని, అది సాధారణ సర్జికల్ మాస్క్ అని పేర్కొన్నారు. అంటే సర్జన్లు ధరించే మాస్క్ లా ఉంటుందన్నారు. బహుశా ఏదైనా డిజైన్ తో కూడిన మాస్క్ గానీ, లేక క్రియేటివ్ మాస్క్ గానీ నేను ధరించవచ్చు అని బిల్ గేట్స్ వివరించారు.
ఇక వచ్ఛే సంవత్సరాంతానికి ఈ కోవిడ్ అంతం కావచ్ఛునని, ప్రపంచానికంతా అయితే మరో ఏడాది పట్టినా పట్టవచ్ఛునని బిల్ గేట్స్ పేర్కొన్నారు. కానీ ఇదే సమయంలో వ్యాక్సీన్లు కూడా రానున్నాయి కదా అన్నారు.