కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. రాకాసి కోరల నుంచి ఎప్పుడు విముక్తి దొరుకుతందాని ప్రపంచ దేశాలు కొవిడ్ వ్యాక్సిన్ రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ తుదిదశకు చేరుకున్నాయి. మన దేశంలోనూ కరోనా వ్యాక్సిన్ తయారీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. అయితే, ఆది నుంచి కొవిడ్ నియంత్రణలో ముందు వరుసలో ఉన్న నెదర్లాండ్ ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. కరోనా కట్టడిలో భారత్ అనుసరిస్తున్న విధానంపై నెదర్లాండ్ అమితమైన ఆసక్తికనబరుస్తోంది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్) ద్వారా కరోనా పరీక్షల కోసం అభివృద్ధి చేసిన ఫెలుడా టెక్నిక్‌పై నెదర్లాండ్ శాస్త్రవేత్తలు ఉత్సాహం చూపుతున్నారు.
ఇదే విషయాన్ని సీఎస్ఐఆర్ అధ్యక్షులు శేఖర్ మాండే వెల్లడించారు. నెదర్లాండ్ తమ దేశంలో కరోనా పరీక్షల సంఖ్యను మరింతగా పెంచాలనుకుంటోందని ఆయన తెలిపారు. ఇందుకోసం భారత్‌ను సంప్రదించిందన్నారు. ఇందుకు సంబంధించిన ఒక లేఖను పంపిందన్నారు. ఇందులో తాము ఫెలుడా టెక్నిక్ ద్వారా పరీక్షలు చేయాలనుకుంటున్నట్లు పేర్కొందన్నారు. ఫెలుడా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిందని మాండే వివరించారు. అంతర్జాతీయంగానూ జరిపిన పరిశోధనలు సత్పలిస్తుందన్నారు. ఈ విధానం ద్వారా ఆర్టీపీసీ టెక్నిక్ కన్నా ఎంతో ఉపయోగకరమైనదన్నారు. ఇందుకు భారత ఔషధ నియంత్రణ మండలి కూడా గుర్తింపునిచ్చిందన్నారు. త్వరలో ప్రభుత్వ అనుమతితో నెదర్లాండ్ ప్రభుత్వానికి కరోనా నియంత్రణకు సహకరిస్తామన్నారు శేఖర్ మాండే.
The Netherlands has evinced interest in #Feluda COVID-19 test indigenously developed by Council of Scientific and Industrial Research (CSIR), says its director general Shekhar Mande
— Press Trust of India (@PTI_News) September 29, 2020