తెలంగాణ రైతులకు డిజిటల్ పాఠాలు

తెలంగాణ రైతులకు సాగులో సహకరించేందుకు నెట్ ఫియో సంస్థ ముందుకు వచ్చింది. ఆన్ లైన్ ద్వారా రైతులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. రైతులతో అనుసంధానం అయ్యేందుకు డిజిటల్ విప్లవం సాయం తీసుకోవాలని నిర్ణయించింది. నెటాఫిమ్ ఇండియా తాజాగా కొన్ని కార్యక్రమాలను ప్రారంభించింది. నెటాఫిమ్ కృషి సంవాద్, నెటాఫిమ్ పాఠశాల, నెటాఫిమ్ టిప్ ఆఫ్ ది డే వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. డిజిటల్ ట్రైనింగ్ ద్వారా రైతులకు విషయపరిజ్ఞానాన్ని అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేట్టింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న […]

తెలంగాణ రైతులకు డిజిటల్ పాఠాలు
Follow us

|

Updated on: Aug 08, 2020 | 12:59 AM

తెలంగాణ రైతులకు సాగులో సహకరించేందుకు నెట్ ఫియో సంస్థ ముందుకు వచ్చింది. ఆన్ లైన్ ద్వారా రైతులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. రైతులతో అనుసంధానం అయ్యేందుకు డిజిటల్ విప్లవం సాయం తీసుకోవాలని నిర్ణయించింది.

నెటాఫిమ్ ఇండియా తాజాగా కొన్ని కార్యక్రమాలను ప్రారంభించింది. నెటాఫిమ్ కృషి సంవాద్, నెటాఫిమ్ పాఠశాల, నెటాఫిమ్ టిప్ ఆఫ్ ది డే వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. డిజిటల్ ట్రైనింగ్ ద్వారా రైతులకు విషయపరిజ్ఞానాన్ని అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేట్టింది.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో రైతులకు సాగుకోసం ముఖ్యమైన సూచనలు అందించేందుకు ఆడియో, టెక్ట్స్, వీడియో మెసేజింగ్ వంటి డిజిటల్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ టూల్స్ ఉపయోగపతాయి.