NEET PG 2021 Exam Dates: దేశవ్యాప్తంగా నీట్ పీజీ పరీక్ష తేదీలు ఖరారు.. అభ్యర్ధ్యులకు పలు సూచనలు చేసిన NBE

|

Jan 15, 2021 | 1:17 PM

దేశ వ్యాప్తంగా కల్లోలం సృష్టించిన కరోనా వైరస్ ను అరికట్టడానికి లాక్ డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో పాఠశాలలు,. కళాశాలలు అన్నీ మూతబడ్డాయి. దాదాపు ఏడాది చదువులు ప్రశ్నార్ధకంగా మారాయి కూడా.. దీంతో 2020-21 ఏడాది నిర్వహించాల్సిన..

NEET PG 2021 Exam Dates:  దేశవ్యాప్తంగా నీట్ పీజీ పరీక్ష తేదీలు ఖరారు.. అభ్యర్ధ్యులకు పలు సూచనలు చేసిన NBE
Follow us on

NEET PG 2021 Exam Dates:దేశ వ్యాప్తంగా కల్లోలం సృష్టించిన కరోనా వైరస్ ను అరికట్టడానికి లాక్ డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో పాఠశాలలు,. కళాశాలలు అన్నీ మూతబడ్డాయి. దాదాపు ఏడాది చదువులు ప్రశ్నార్ధకంగా మారాయి కూడా.. దీంతో 2020-21 ఏడాది నిర్వహించాల్సిన దాదాపు అన్ని పరీక్షలను ఆలస్యంగా నిర్వహిస్తున్నారు. తాజాగా నీట్ పీజీ 2021 పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. ఈ మేరకు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. నీట్ పరీక్షను ఏప్రిల్ 18న దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నామని తెలిపింది. ఈ సరి పరీక్షలను ఆన్ లైన్ విధానంలో నిర్వహించనున్నామని అందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పింది.

పీజీ ఎంట్రెన్స్ కు హాజరయ్యే అభ్యర్థులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా గుర్తించబడిన సంస్థ నుంచి జారీ అయిన MBBS సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి. MCI లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్ జారీ చేసిన తాత్కాలిక లేదా శాశ్వత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలని కోరింది. ఈ పరీక్షకు హాజరు కావాలనుకుంటున్న అభ్యర్థలు జూన్ 30, 2021లోపు ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేసి ఉండాలని సూచించింది. ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా 6,102 సంస్థల్లో మాస్టర్‌ ఆఫ్ సర్జరీ 10,821 సీట్లను, డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌-MD 19,953 సీట్లను భర్తీ చేయనున్నారు

అభ్యర్థులు మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి nbe.edu.in, natboard.edu.in వెబ్‌సైట్లను సందర్శించవచ్చు.. అయితే ఏవైనా ఊహించని పరిస్థితులు ఏర్పడితే పరీక్ష తేదీలను మార్పు చేసే అవకాశం ఉందని తెలిపింది.

Also Read:  బోర్డర్ లో భద్రతాదళాలతో కలిసి పనిచేయడం జీవితంలో మరచిపోలేని మధురజ్ఞాపకం అంటున్న భళ్లాలదేవ