గుడ్ న్యూస్: నవోదయ ఉపాధ్యాయుల భర్తీకి నోటిఫికేషన్

నిరుద్యోగులకు శుభవార్త.. నవోదయలో విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ వెలువడింది కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న 454 మంది ఉపాధ్యాయుల భ‌ర్తీకి న‌వోద‌య విద్యాల‌య స‌మితి(ఎన్‌వీఎస్‌) నోటిఫికేష‌న్ జారీ చేసింది

గుడ్ న్యూస్: నవోదయ ఉపాధ్యాయుల భర్తీకి నోటిఫికేషన్
Balaraju Goud

|

Sep 04, 2020 | 6:27 PM

నిరుద్యోగులకు శుభవార్త.. నవోదయలో విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ వెలువడింది కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న 454 మంది ఉపాధ్యాయుల భ‌ర్తీకి న‌వోద‌య విద్యాల‌య స‌మితి(ఎన్‌వీఎస్‌) నోటిఫికేష‌న్ జారీ చేసింది. అర్హులైన అభ్య‌ర్థుల నుండి ద‌ర‌ఖాస్తుల‌ను ఈ మెయిల్ ద్వారా పంపించాలని సూచించింది. గోవా, గుజ‌రాత్‌, మ‌హారాష్ర్ట‌, డామ‌న్‌ డ‌య్యూ, దాద్రా న‌గ‌ర్ హ‌వేలీలో ఖాళీలను అనుస‌రించి కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ చేప‌ట్ట‌నున్న‌ట్లు ఎన్‌వీఎస్ తెలిపింది. మొత్తం 454 ఖాళీల్లో 73 ఫ్యాకల్టీ కమ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు కాగా, 98 పీజీటీ, 283 టీజీటీ పోస్టులు ఉన్నట్లు ప్రకటనలో తెలిపింది. పీజీటీ పోస్టుల‌కు నెల‌వారీ జీతం సాధార‌ణ స్టేష‌న్ అయితే రూ. 27,500గా అదే హార్డ్ స్టేష‌న్‌(కుచ్‌, డాంగ్స్‌, ర‌త్న‌గిరి)లోనైతే నెల‌కు రూ. 32,500గా నిర్ధారించారు. టీజీటీ పోస్టుల‌కు నెల‌వారీ జీతం సాధార‌ణ స్టేష‌న్‌లోనైతే రూ. 26,250గా అదే హార్డ్ స్టేష‌న్‌(కుచ్‌, డాంగ్స్‌, ర‌త్న‌గిరి)లోనైతే నెల‌కు రూ.31,250గా ఉంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 11వ తేదీ లోగా దరఖాస్తులు సమర్పించాలని తెలిపింది. ద‌ర‌ఖాస్తుల‌ను conpune20@gmail.com కు మెయిల్ చేయాలని పేర్కొంది. నియామ‌క‌మైన‌ ఉపాధ్యాయుల‌కు బోర్డింగ్‌, లాడ్జింగ్ క్యాంప‌స్ ఆవ‌ర‌ణ‌లోనే క‌ల్పించ‌నున్నారు. ఉద్యోగానికి కాలపరిమితి విధించారు అధికారులు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu