విద్య అంటే మార్కులు కాదంటూ.. నేచురల్ స్టార్ ట్వీట్.!

తెలంగాణ ఇంటర్ ఫలితాలు రాష్ట్రమంతటా తీవ్ర దుమారం రేపాయి. ఇంటర్ బోర్డు అవకతవకల కారణంగా ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా ఈ ఆత్మహత్యలపై నేచురల్ స్టార్ నాని స్పందించాడు. విద్య అంటే నేర్చుకోవడం అని.. అంతేకానీ మీకు వచ్చే మార్కులు కాదని అన్నాడు. అర్హత సాధించని ప్రతిసారి మరోసారి ప్రయత్నించాలని సూచించాడు. మార్కుల కంటే జీవితంలో విలువైనవి చాలా ఉన్నాయని అన్నాడు. మిమ్మల్ని అమితంగా ప్రేమించే తల్లిదండ్రుల గురించి ఆలోచించాలని హితవు పలికాడు. […]

విద్య అంటే మార్కులు కాదంటూ.. నేచురల్ స్టార్ ట్వీట్.!

Updated on: Apr 25, 2019 | 2:19 PM

తెలంగాణ ఇంటర్ ఫలితాలు రాష్ట్రమంతటా తీవ్ర దుమారం రేపాయి. ఇంటర్ బోర్డు అవకతవకల కారణంగా ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా ఈ ఆత్మహత్యలపై నేచురల్ స్టార్ నాని స్పందించాడు. విద్య అంటే నేర్చుకోవడం అని.. అంతేకానీ మీకు వచ్చే మార్కులు కాదని అన్నాడు. అర్హత సాధించని ప్రతిసారి మరోసారి ప్రయత్నించాలని సూచించాడు. మార్కుల కంటే జీవితంలో విలువైనవి చాలా ఉన్నాయని అన్నాడు. మిమ్మల్ని అమితంగా ప్రేమించే తల్లిదండ్రుల గురించి ఆలోచించాలని హితవు పలికాడు. ఇంటర్ ఫలితాలను చూసి వారు మిమ్మల్ని ప్రేమించడం లేదని, మిమ్మల్ని చూసే ప్రేమిస్తున్నారని ట్వీట్ చేశాడు.