దేశం మొత్తం తెలంగాణకు అండగా ఉంటుందని రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. రాష్ర్టంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలపై రాష్ర్టపతి ట్విట్టర్ ద్వారా స్పందించారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. 24 గంటల వ్యవధిలో 24 మంది ప్రాణాలను కోల్పోయారు. అకస్మాత్తుగా వచ్చిన వరదలతో భాగ్యనగరం అతలాకుతలం అయ్యింది. దీంతో వర్ష పరిస్థితులపై గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడినట్లు రాష్ట్రపతి చెప్పారు. హైదరాబాద్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల జరిగిన విధ్వంసం, ప్రాణ నష్టంపై రామ్‌నాథ్ విచారం వ్యక్తం చేశారు. ఈ సంక్షోభ సమయంలో దేశం మొత్తం తెలంగాణ ప్రజలకు తోడుగా ఉంటుందని కోవింద్ పేర్కొన్నారు. అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించామన్నారు.
హైదరాబాద్ & తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల జరిగిన విధ్వంసం, ప్రాణ నష్టం పట్ల
తెలంగాణ గవర్నర్ @DrTamilisaiGuv, సిఎం కెసిఆర్ తో మాట్లాడడం జరిగింది. ఈ సంక్షోభ సమయంలో దేశం మొత్తం తెలంగాణ ప్రజలకు తోడుగా ఉంటుంది.— President of India (@rashtrapatibhvn) October 14, 2020