సూర్యుడు, సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు, వాటి ఉపగ్రహాలు, ఇతర ఖగోళ వస్తువుల సముదాయమే సౌర కుటుంబం. ఖగోళ శాస్త్రవేత్తలు సౌరవ్యవస్థలో ప్రకాశవంతమైన ఓ న్యూట్రాన్ స్టార్‌ను కనుగొన్నారు. ఈ నక్షత్రానికి స్విఫ్ట్ జే1818.0-1607గా నామకరణం చేశారు. ఇది 240 ఏళ్ల కిందటిదిగా తేల్చారు. ఇది విశ్వ ప్రమాణాలకు యధార్థంగా ఉందని పేర్కొన్నారు. దట్టమైన ఎక్స్ కిరణాలను వెదజల్లుతున్న ఈ నక్షత్రాన్ని నాసా పంపిన నీల్ గెహెర్లెస్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ గుర్తించింది.
కాగా.. దీన్ని అధ్యయనం చేసిన యురోపియన్ స్పేస్ ఏజెన్సీ ఎక్స్‌ఎంఎం న్యూటన్ అబ్జర్వేటరీ, నాసా జెట్ ప్రపల్షన్ ల్యాబోరేటరీ బృందం ఆ నక్షత్రం భౌతిక లక్షణాలు, వయస్సును నిర్ధారించింది. ఈ నక్షత్రం సూర్యుని ద్రవ్యరాశిలో సగం, ఘనపరిమాణంలో సూర్యుడి కంటే ఒక ట్రిలియన్ రెట్లు చిన్నదని తేల్చారు. అలాగే, ఇది మాగ్నెటార్ వర్గానికి చెందిందని, ఇందులో ఇది అత్యంత చిన్నదని కనుగొన్నారు. దీని ద్వారా మనం మాగ్నెటార్స్ లైఫ్ గురించి అర్థం చేసుకోవచ్చని తెలిపారు. ఈ నక్షత్రం ధనురాశిలో భూమికి 16,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని పేర్కొన్నారు.