ప్రధాని మంత్రిగా నరేంద్రమోదీ రేపు ప్రమాణస్వీకారం చేయననున్న సందర్భంలో ఆయన కొత్త కేబినెట్ లో ఎవరు ఉండబోతున్నారని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇకపోతే ఐదేళ్లుగా ఆర్ధికమంత్రి సేవలందించిన అరుణ్ జైట్లీ ఆరోగ్య కారణాల రీత్యా తనకు ఏ పదవి వద్దని.. పార్టీలోనే ఉంటూ సేవలందిస్తారని ఇవాళ ఉదయం మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇందుకు గానూ నరేంద్ర మోదీ అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో వీరిద్దిరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.కేబినెట్‌లో చేరరాదని తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని జైట్లీని మోదీ కోరినట్లు తెలుస్తోంది.