ప్రధాని మోదీకి యూఏఈ అరుదైన గౌరవం

భారత ప్రధాని నరేంద్ర మోదీకి యూఏఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. మోదీ హయాంలో భారత్‌తో యూఏఈకి బంధాలు ఎంతగానో బలపడ్డాయని.. అందుకే ఈ పురస్కారాన్ని ప్రకటిస్తున్నట్లు అబుదాబి యువరాజు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నాహ్యన్‌ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘ఎన్నడూ లేనంతగా భారత్‌తో మా బంధాలు బలపడ్డాయి. అందుకోసం నా మిత్రుడు, ప్రధాని మోదీ ఎంతగానో కృషిచేశారు. ఆయన చేసిన ఈ కృషికి గాను ఆయనకు జాయెద్‌ పురస్కారాన్ని ప్రకటిస్తున్నాను అని ట్వీట్ చేశారు. […]

ప్రధాని మోదీకి యూఏఈ అరుదైన గౌరవం
Follow us

|

Updated on: Apr 04, 2019 | 7:24 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీకి యూఏఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. మోదీ హయాంలో భారత్‌తో యూఏఈకి బంధాలు ఎంతగానో బలపడ్డాయని.. అందుకే ఈ పురస్కారాన్ని ప్రకటిస్తున్నట్లు అబుదాబి యువరాజు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నాహ్యన్‌ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘ఎన్నడూ లేనంతగా భారత్‌తో మా బంధాలు బలపడ్డాయి. అందుకోసం నా మిత్రుడు, ప్రధాని మోదీ ఎంతగానో కృషిచేశారు. ఆయన చేసిన ఈ కృషికి గాను ఆయనకు జాయెద్‌ పురస్కారాన్ని ప్రకటిస్తున్నాను అని ట్వీట్ చేశారు.

ఇక ఇప్పటి వరకూ ఈ పురస్కారం అందుకున్న వారిలో రష్యా ప్రెసిడెంట్‌ పుతిన్‌, అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్‌, ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు సర్కోజీ , జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ఉన్నారు.