వరుణ దేవుడితో మోదీ ‘చెట్టపట్టాల్’..!

| Edited By:

Jun 09, 2019 | 12:46 PM

మోదీకి, వరుణ దేవుడికి పడదా..? మోదీ వస్తే వర్షాలను కురిపించేందుకు వరుణ దేవుడు ఇష్టపడటం లేదా..? అసలు అధికారంలో ఉన్న మనిషిని బట్టి వరుణుడు వర్షాలు కురిపిస్తాడా..? ప్రస్తుతం పలువురిని తొలుస్తున్న ప్రశ్నలివి. 2014లో ఎన్డీయే కూటమి భాగస్వామ్యంతో తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు నరేంద్ర మోదీ. అయితే ఆ సంవత్సరం దేశంలో వర్షాలు అంతంత మాత్రంగానే పడ్డాయి. అంతేకాదు మరుసటి సంవత్సరం 2015లోనూ దేశవ్యాప్తంగా వర్షపాతం అంతంత మాత్రంగానే నమోదైంది. అయితే వందేళ్లలో ఇలా వరుసగా […]

వరుణ దేవుడితో మోదీ ‘చెట్టపట్టాల్’..!
Follow us on

మోదీకి, వరుణ దేవుడికి పడదా..? మోదీ వస్తే వర్షాలను కురిపించేందుకు వరుణ దేవుడు ఇష్టపడటం లేదా..? అసలు అధికారంలో ఉన్న మనిషిని బట్టి వరుణుడు వర్షాలు కురిపిస్తాడా..? ప్రస్తుతం పలువురిని తొలుస్తున్న ప్రశ్నలివి. 2014లో ఎన్డీయే కూటమి భాగస్వామ్యంతో తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు నరేంద్ర మోదీ. అయితే ఆ సంవత్సరం దేశంలో వర్షాలు అంతంత మాత్రంగానే పడ్డాయి. అంతేకాదు మరుసటి సంవత్సరం 2015లోనూ దేశవ్యాప్తంగా వర్షపాతం అంతంత మాత్రంగానే నమోదైంది. అయితే వందేళ్లలో ఇలా వరుసగా రెండు సంవత్సరాలు కరువు రావడం అదే తొలిసారి కావడం విశేషం.

ఇక ఈ ఏడాది వర్షాకాలానికి ముందు అంటే మార్చి 1, మే 31 మధ్యకాలంలో వర్షపాతం కేవలం 25శాతం మాత్రమేనని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే మే 30 నుంచి జూన్ 6 మధ్య కాలంలో వర్షపాత లేమి 40శాతం పెరిగిందని ఆ శాఖ తెలిపింది. దీంతో మోదీకి, వరుణుడికి పడదా..? అంటూ కొంతమంది సెటైర్లు సంధిస్తున్నారు. అయితే వర్షానికి, నాయకులకు సంబంధం లేదని.. పెరుగుతోన్న కాలుష్యం, తగ్గుతోన్న అటవీ సంపద వలనే వర్షపాతం తగ్గుతోందని మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.