
జగన్ సర్కారుపై వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామరాజు తన దాడి తీవ్రత తగ్గించడంలేదు. తాజాగా ఏపీ సర్కారును ఆయన కళ్లుండి మనసులేని ప్రభుత్వంగా అభివర్ణించారు. కళ్లు లేకపోయినా మనసున్న న్యాయస్థానాల ద్వారా తప్పకుండా న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. అమరావతి రైతుల న్యాయపోరాటంపై రఘు ఈ విధంగా స్పందించారు. డిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీలో పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు చట్టంపై స్టేటస్ కోను హైకోర్టు సెప్టెంబరు 21 వరకు పొడిగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. న్యాయం కోసం పోరాడుతున్న అమరావతి రైతులకు దక్కిన పాక్షిక విజయం ఇది అన్న ఆయన.. రైతులు మరింత ఆశాభావంతో ఉండాలని, ఫలితం కాస్త ఆలస్యమైనప్పటికీ గాంధేయ మార్గంలో ముందుకెళ్లాలని ఉద్బోధించారు. కోర్టు పరిభాషలో స్టేటస్ కో అయినా, స్టే అయినా పెద్దగా తేడా లేదని చెప్పుకొచ్చారు విజయరామ.