ఆర్కేకు నారా లోకేష్‌ శుభాకాంక్షలు

అమరావతి : మంగళగిరి నియోజకవర్గంనుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డికి టీడీపీ నేత, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్‌బాబు అభినందనలు తెలియజేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై అత్యంత విశ్వాసంతో ఓట్లు వేసిన ప్రజలందరికి నమస్కారాలు తెలిపారు. నామినేష‌న్ వేసిన నాటినుంచి కౌంటింగ్ వ‌ర‌కు అహ‌ర్నిశ‌లు తన కోసం శ్ర‌మించిన తెలుగుదేశం పార్టీ నాయ‌కులకు, కార్య‌క‌ర్త‌లకు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. తొలిసారి ఎన్నిక‌ల‌లో పోటీచేసిన తనకు మ‌ద్ద‌తుగా నిలిచిన ప్ర‌తీ ఒక్క‌రికి పేరుపేరునా […]

ఆర్కేకు నారా లోకేష్‌ శుభాకాంక్షలు

Updated on: May 23, 2019 | 10:57 PM

అమరావతి : మంగళగిరి నియోజకవర్గంనుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డికి టీడీపీ నేత, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్‌బాబు అభినందనలు తెలియజేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై అత్యంత విశ్వాసంతో ఓట్లు వేసిన ప్రజలందరికి నమస్కారాలు తెలిపారు. నామినేష‌న్ వేసిన నాటినుంచి కౌంటింగ్ వ‌ర‌కు అహ‌ర్నిశ‌లు తన కోసం శ్ర‌మించిన తెలుగుదేశం పార్టీ నాయ‌కులకు, కార్య‌క‌ర్త‌లకు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. తొలిసారి ఎన్నిక‌ల‌లో పోటీచేసిన తనకు మ‌ద్ద‌తుగా నిలిచిన ప్ర‌తీ ఒక్క‌రికి పేరుపేరునా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నానన్నారు.

మీడియా మిత్రుల స‌హ‌కారం మ‌రువ‌లేనిదన్నారు. ఎన్నిక ప్ర‌క్రియ‌ ప్రశాంతంగా సాగేందుకు స‌హ‌క‌రించి, ప్ర‌జాస్వామ్య స్ఫూర్తిని చాటిన మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు అందరూ ఆద‌ర్శంగా నిలిచారని పేర్కొన్నారు. నియోజ‌క‌వ‌ర్గ పార్టీ నాయ‌కులకు, కార్య‌క‌ర్త‌ల‌కు ఎల్ల‌ప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. మంగ‌ళ‌గిరి అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ప్ర‌జ‌ల్లో ఉంటూ ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై పోరాడ‌తానని అన్నారు.