చినబాబుకు కోపం వచ్చిన వేళ..!

అమరావతి: రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్‌కు ఉండవల్లిలో చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉండవల్లిలో పర్యటించిన ఆయనకు అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ప్రశ్నలు సంధించారు. భూసేకరణలో భాగంగా తమ పొలాలను బలవంతంగా లాక్కున్నారని.. అంతేకాకుండా తమ ఇళ్లు కూడా లాక్కోవడానికి నోటీసులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో అసహనం వ్యక్తం చేసిన లోకేష్.. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక ఎన్నికల ప్రచార నిమిత్తం […]

చినబాబుకు కోపం వచ్చిన వేళ..!

Updated on: Apr 08, 2019 | 7:28 PM

అమరావతి: రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్‌కు ఉండవల్లిలో చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉండవల్లిలో పర్యటించిన ఆయనకు అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ప్రశ్నలు సంధించారు. భూసేకరణలో భాగంగా తమ పొలాలను బలవంతంగా లాక్కున్నారని.. అంతేకాకుండా తమ ఇళ్లు కూడా లాక్కోవడానికి నోటీసులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో అసహనం వ్యక్తం చేసిన లోకేష్.. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక ఎన్నికల ప్రచార నిమిత్తం లోకేష్ మంగళగిరిలో పర్యటించగా… అక్కడి ప్రజలు ఆయన ప్రచారంపై ఆసక్తి చూపడం లేదని సమాచారం.