నేచురల్ స్టార్ నాని ఇప్పుడు హీరోగా, నిర్మాతగా రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘V’ చిత్ర షూటింగ్ ముగించుకోని ‘టక్ జగదీష్’ షెడ్యూల్స్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రాన్ని శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ నుంచి వచ్చిన ఓ అబ్డేట్ ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతుంది. నేచురల్ స్టార్ ఈ మూవీలో ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడని టాక్. గతంలో నాని ఎప్పుడూ పోలీస్ పాత్రల్లో కనిపించలేదు. దీంతో ఫ్యాన్స్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ మూవీలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. హరీష్ పెద్ది, సాహు గారపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుపుకొంటోంది. బ్రదర్స్ సెంటిమెంట్ థీమ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. నేచురల్‌స్టార్ పవర్‌ఫుల్ కాప్‌గా దర్శనమివ్వబోతుండగా, ఐశ్వర్య అతని మరదలుగా కనిపించనుందని తెలుస్తోంది. ప్రస్తుతం వీళ్లిద్దరిపై సీన్స్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో నానికి బ్రదర్‌గా జగపతిబాబు నటిస్తున్నాడు. ఈ ఏడాది ద్వితియార్థంలో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది మూవీ యూనిట్.