అబ్దుల్‌ సలాం కేసులో నిందితులకు షరతులతో కూడిన బెయిల్‌, వివరాలు ఇలా ఉన్నాయి

|

Dec 11, 2020 | 9:27 PM

తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన  అబ్దుల్‌ సలాం ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో నిందితులకు కర్నూలు జిల్లా నంద్యాల కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

అబ్దుల్‌ సలాం కేసులో నిందితులకు షరతులతో కూడిన బెయిల్‌, వివరాలు ఇలా ఉన్నాయి
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన  అబ్దుల్‌ సలాం ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో నిందితులకు కర్నూలు జిల్లా నంద్యాల కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ గంగాధర్‌కు బెయిల్ లభించింది. ఇద్దరికీ రూ.5వేల చొప్పున పూచీకత్తుతో పాటు రెండు నెలల పాటు ప్రతి సోమవారం మార్నింగ్ 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఆళ్లగడ్డ డీఎస్పీ ఎదుట హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు.

దొంగతనం కేసులకు సంబంధించి తనకు ఏ సంబంధం లేకపోయినా వేధింపులకు గురిచేస్తున్నారనే మనస్తాపంతో నంద్యాల సిటీకి చెందిన అబ్దుల్‌ సలాం తన ఫ్యామిలితో సహా ఆత్మహత్య చేసుకున్నారు. పాణ్యం సమీపంలో రైల్వేట్రాక్‌పై భార్యాపిల్లలతో సహా తనువు చాలించాడు. ఆత్మహత్యకు ముందు ఆ కుటుంబం తీసుకున్న సెల్ఫీ వీడియో వైరల్‌గా మాదింది. దాని ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు నంద్యాల సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ గంగాధర్‌లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Also Read :

అగ్గితో ఆటలొద్దు..సీఎం మమతా బెనర్జీకు గవర్నర్ జగ్​దీప్​​ ధనకర్ డైరెక్ట్ వార్నింగ్

రైతులకు ఆదాయం పెంచే విధానాలపై ఫోకస్ పెట్టండి, బ్యాంకర్లకు సీఎం జగన్ సూచన

బుమ్రా కొట్టిన షాట్​కు గ్రౌండ్‌లో కుప్పకూలిన ఆసీస్ బౌలర్​, నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న సిరాజ్ పరిగెత్తుకు వెళ్లి..