బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి అనుమానాస్పద మృతి..!

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి అనుమానాస్పదమృతి తీవ్ర కలకలం సృష్టించింది. చౌటుప్పల్ మండలం ఆంథోల్ మైసమ్మ దేవాలయం సమీపంలోని గణేష్ వెంచర్‌లో నల్లగొండకు చెందిన బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి షణ్ముఖ చారి అనుమానాస్పద స్థితిలో చెందాడు.

బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి అనుమానాస్పద మృతి..!

Updated on: Jun 28, 2020 | 10:18 PM

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి అనుమానాస్పదమృతి తీవ్ర కలకలం సృష్టించింది. చౌటుప్పల్ మండలం ఆంథోల్ మైసమ్మ దేవాలయం సమీపంలోని గణేష్ వెంచర్‌లో నల్లగొండకు చెందిన బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి షణ్ముఖ చారి అనుమానాస్పద స్థితిలో చెందాడు. తన సొంతకారులోనే చారీ నిగతజీవిగా పడి ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే మృతదేహాన్ని దహనం చేసేందుకు యత్నించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న చౌటుప్పల్ పోలీసులు.. ఇది హత్యా..? ఆత్మహత్య..? అనే కోణంలో విచారణ చేపట్టారు .

Loading...
Unable to load recommendations.
Follow Us