జనసేనను నిలబెట్టింది ఎవరు?

|

Sep 05, 2020 | 8:36 PM

జ‌న‌సేన పార్టీలో యువతదే కీలకపాత్ర అని చెప్పారు ఆపార్టీ ముఖ్య నేత నాదేండ్ల మనోహర్. జనసేన మీద రెండు పార్టీల కుతంత్రాల‌ను బలంగా తిప్పికొట్టింది యు‌వ‌తేనని తెలిపారు. యువ‌ర‌క్తంతోనే..

జనసేనను నిలబెట్టింది ఎవరు?
Follow us on

జ‌న‌సేన పార్టీలో యువతదే కీలకపాత్ర అని చెప్పారు ఆపార్టీ ముఖ్య నేత నాదేండ్ల మనోహర్. జనసేన మీద రెండు పార్టీల కుతంత్రాల‌ను బలంగా తిప్పికొట్టింది యు‌వ‌తేనని తెలిపారు. యువ‌ర‌క్తంతోనే రాజ‌కీయాల్లో మార్పు వ‌స్తుంద‌న్న ఆయన.. విజ‌య‌ద‌శ‌మి నుంచి బీజేపీ, జన‌సేన క్షేత్ర‌స్థాయి కార్య‌క్ర‌మాలు ఉంటాయ‌ని పేర్కొన్నారు. ఈ రోజు ఆయ‌న బెంగ‌ళూరు ఐటీ నిపుణుల‌తో వెబినార్ ద్వారా చ‌ర్చా కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా నాదెండ్ల పలు అంశాలపై మాట్లాడారు. ప్ర‌స్తుత రాజ‌కీయాలు వ్యాపార‌ప‌రం అయ్యాయ‌ని, నేత‌లు అడ్డ‌దారులు తొక్కుతున్నార‌ని ఆయ‌న ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లు ఉన్న‌వాడికే సీట్లు ఇచ్చి ప్రోత్స‌హిస్తున్నార‌ని.. అలాంటి వారు ఎన్నిక‌ల్లో గెలిచాక పెట్టిన పెట్టుబ‌డిని సంపాదించ‌డానికే ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్నార‌ని వివరించారు. మ‌న ద‌గ్గ‌ర ఎంపీ సీటుకు కోట్ల రూపాయ‌లు కుమ్మ‌రిస్తున్నార‌ని.. ఈ వ్యవస్థ మారకపోతే దేశమే సర్వనాశనం అయ్యే ప్రమాదం ఉందన్నారు.