గుంటూరు జిల్లా : వింత వ్యాధితో కోళ్లు మృత్యువాత
గుంటూరు జిల్లాలోని ముప్పాళ్ల మండలంలోని గ్రామాల్లో కోళ్లు అంతుచిక్కని వ్యాధితో మృత్యువాతపడుతున్నాయి. గ్రామాల్లో ఎక్కువగా రైతులు పశువులతో పాటు చిన్నపాటి ఆదాయ వనరుగా నాటుకోళ్లు పెంచుతూ ఉంటారు.
గుంటూరు జిల్లాలోని ముప్పాళ్ల మండలంలోని గ్రామాల్లో కోళ్లు అంతుచిక్కని వ్యాధితో మృత్యువాతపడుతున్నాయి. గ్రామాల్లో ఎక్కువగా రైతులు పశువులతో పాటు చిన్నపాటి ఆదాయ వనరుగా నాటుకోళ్లు పెంచుతూ ఉంటారు. మరి కొందరు అరుదైన జాతి కోళ్లను పెంచి ఆదాయం ఆర్జిస్తూ ఉంటారు. అయితే మొన్నీమధ్య వరకు పూర్తి ఆరోగ్యంతో తిరిగిన కోళ్లు హఠాత్తుగా ఎలాంటి వ్యాధి సింటమ్స్ లేకుండానే నిమిషాల వ్యవధిలో చనిపోతున్నాయి. గ్రామాల్లో రోజుకు వందల సంఖ్యలో ఈ అంతుచిక్కని వ్యాధితో మరణిస్తున్నాయి. రైతులు స్థానిక వెటర్నరీ డాక్టర్లను సంప్రదించి యాంటిబయోటిక్స్ కొనుగోలు చేసి కోళ్లకు వాడినా ఫలితం ఉండట్లేదు. దీనితో కోళ్ల పెంపకం దార్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పశు వైద్యాధికారులు స్పందించి కోళ్లకు సోకిన వ్యాధిని గుర్తించి సమర్థవంతమైన వ్యాక్సిన్ అందజేయాలని కోరుతున్నారు. ( అభిమాన హీరోకు పెళ్లి కావాలని ఫ్యాన్స్ వింత మొక్కుబడులు )