Maynmar Protests: మయన్మార్ లో మళ్ళీ హింస, సైన్యం కాల్పుల్లో ఏడుగురి మృతి, అనేకమందికి గాయాలు

| Edited By: Pardhasaradhi Peri

Feb 28, 2021 | 6:33 PM

మయన్మార్ లో మళ్ళీ హింస రేగింది. సైన్యానికి వ్యతిరేకంగా ఆదివారం జరిగిన నిరసన ప్రదర్శనల్లో వేలాది మంది పాల్గొన్నారు. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు..

Maynmar  Protests: మయన్మార్ లో మళ్ళీ హింస, సైన్యం కాల్పుల్లో ఏడుగురి మృతి, అనేకమందికి గాయాలు
Follow us on

మయన్మార్ లో మళ్ళీ హింస రేగింది. సైన్యానికి వ్యతిరేకంగా ఆదివారం జరిగిన నిరసన ప్రదర్శనల్లో వేలాది మంది పాల్గొన్నారు. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు,  సైన్యం జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించగా, అనేకమంది గాయపడ్డారు. యాంగాన్ సిటీలో పోలీసులు నిరసనకారులను చెదరగొట్టేందుకు మొదట స్టెన్ గ్రెనెడ్స్ ను గాల్లోకి పేల్చారు. బాష్పవాయువు ప్రయోగించారు. అయినా ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో వారిపైకి పోలీసులు, సైనికులు కూడా విరుచుకపడ్డారు. వారి కాల్పులతో అనేకమంది గాయపడగా వీధులు, పేవ్ మెంట్లు రక్త సిక్తంగా భీతావహంగా కనబడ్డాయి.  క్షతగాత్రులైనవారిని తోటి ఆందోళనకారులు తమ వెంట తీసుకువెళ్తుండగా వారిపై కూడా కాల్పులు జరిగినట్టు సమాచారం.  మిలిటరీ బూట్ల ముందు తాము సాగిలపడే ప్రసక్తే  లేదని ఓ నిరసనకారుడు ఆవేశంగా వ్యాఖ్యానించాడు. ఎంతకైనా తెగిస్తాం, మా పోరాటాన్ని నిరవధికంగా సాగిస్తాం అన్నాడు. గాయపడినా, మరణమే సంభవించినా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడమే తమ లక్ష్యమన్నాడు.  మయన్మార్ యుధ్ధ భూమిలా ఉందని బౌధ్ద నేత ఒకరు పేర్కొన్నారు.

ఈ నెల 1 న మయన్మార్ లో సైనిక కుట్రజరిగిన సంగతి తెలిసిందే. ప్రజానేత ఆంగ్ సాన్ సూకీని వారు నిర్బంధించి ఏడాది పాటు ఎమర్జెన్సీని విధించారు.నవంబరులో జరిగిన ఎన్నికల్లో ఫ్రాడ్ జరిగిందని జుంటా నేత జనరల్ మింగ్ ఆన్ హిలాంగ్ తప్పుడు ఆరోపణ చేసి ఆమెను జైలుకు పంపారు.

అయితే ఆమెను వెంటనే విడుదల చేయాలనీ, ఈ నియంతృత్వ పాలనకు స్వస్తి చెప్పాలని ఆందోళనకారులు అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు.  కొన్ని రోజులుగా స్తబ్దంగా ఉన్న నిరసన మళ్ళీ ఊపందుకుంది.  టీచర్లు కూడా ఈ ఆందోళనలో పాల్గొనడం విశేషం. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు గాలిలో కాల్పులు జరిపారు. నిన్న దాదాపు 500 మందిని అరెస్టు చేశారు. ఆదివారం కూడా ఈ ఆరెస్తులపర్వం సాగింది. కాగా- పలు పశ్చిమ దేశాలు మయన్మార్ పై కఠిన ఆంక్షలు విధించాయి. ఐరాస కూడా మయన్మార్ లో సైనిక ప్రభుత్వ దమన నీతిని ఖండించింది. సూకీని వెంటనే  విడుదల చేసి ప్రజా పాలనను పునరుధ్దరించాలని డిమాండ్ చేసింది.

 

Also Read:

Murder Of Lawyer-Couple : అడ్వకేట్ దంపతుల హత్య కేసు విచారణ.. సుందిళ్ల బ్యారేజీపై పోలీసులు ఫోకస్

పుణేలో మహిళ ఆత్మహత్య కేసు, మహారాష్ట్ర అటవీ శాఖ మంత్రి సంజయ్ రాథోడ్ రాజీనామా.