తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మైహోం గ్రూప్ అధినేత

దేవదేవుడు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ఈరోజు ఉదయం టీటీడీ బోర్డు సభ్యులు, మైహోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో ఆయనకు ఆలయాధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న నాదనీరాజనం వేదికపై జరుగుతున్న సుందరకాండ పారాయణంలో రామేశ్వరరావు పాల్గొన్నారు. వేద పారాయణదారులతో పాటు సుందరకాండ శ్లోకాలను పఠించి తరించారు.

Edited By:

Updated on: Oct 21, 2020 | 2:40 PM