
సిమెంట్ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్న మహాసిమెంట్ కొత్త ఒరవడికి నాంది పలికింది. మహా HD ప్లస్ సిమెంట్ పేరుతో నూతన ఉత్పత్తి శ్రేణిని తాజాగా మార్కెట్లోకి తెస్తోంది. మహా సిమెంట్ బ్రాండ్‌లోని కొత్త ప్రొడక్ట్ అయిన మహా HD ప్లస్ సిమెంట్‌ను మైహోం ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ఎస్. సాంబశివరావు లాంఛనంగా ప్రారంభించారు.
ఇరవై ఏళ్ల క్రితం నెలకొల్పిన మహాసిమెంట్ ఎన్నో మైలురాళ్లు దాటిందని సాంబశివరావు చెప్పారు. ఇప్పుడు ఏడాదికి పది మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేస్తోందని ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా నిర్మిస్తోన్న ప్రాజెక్టులలో యాభై శాతం మహాసిమెంట్‌నే వాడుతున్నారని సాంబశివరావు వెల్లడించారు.
నాణ్యమైన సిమెంట్ అందజేస్తూ వినియోగదారుల మన్ననలు అందుకున్న మహాసిమెంట్ ప్రీమియం ఉత్పత్తుల్లో మరో ప్రోడక్ట్ తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు సంస్థ సీనియర్ ప్రెసిడెంట్ విజయవర్థన్ రావు.
హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన మహాసిమెంట్ డీలర్స్ మీట్ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహ భరితంగా జరిగింది. ఈ సందర్భంగా మహాసిమెంట్‌ను మార్కెట్లోకి తీసుకెళ్లి సంస్థ అభివృద్ధికి దోహదపడుతోన్న 200 మంది డీలర్లను అభినందించారు. బంగారు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహా సిమెంట్ సంస్థలో వివిధ హోదాల్లో పనిచేస్తోన్న సిబ్బంది, మార్కెటింగ్ హెడ్స్ పాల్గొన్నారు.
నిర్మాణ రంగంలో 50 శాతం పెరుగుదల ఉండే అవకాశముందని.. దానికి అనుగుణంగా మహాసిమెంట్ కూడా అత్యధిక శాతం అభివృద్ధిని సాధించగలుగుతుందని ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సాంబశివరావు తెలిపారు.