బ్లాక్ మార్కెట్ లో కరోనా డ్రగ్ రెమ్‌డిసివిర్.. మెడికల్ షాప్ ఓనర్ అరెస్ట్..

| Edited By:

Jul 13, 2020 | 4:52 AM

కోవిద్-19 కు ఎమర్జెన్సీ మెడిసిన్ గా వినియోగంలో ఉన్న యాంటీ వైరల్ డ్రగ్ రెమిడిసివిర్ జనరిక్ వర్షన్ ‌ను అధిక ధరకు విక్రయిస్తున్న ఓ మెడికల్ షాప్ ఓనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని మీరా రోడ్ పోలీస్ స్టేషన్

బ్లాక్ మార్కెట్ లో కరోనా డ్రగ్ రెమ్‌డిసివిర్.. మెడికల్ షాప్ ఓనర్ అరెస్ట్..
Follow us on

కోవిద్-19 కు ఎమర్జెన్సీ మెడిసిన్ గా వినియోగంలో ఉన్న యాంటీ వైరల్ డ్రగ్ రెమిడిసివిర్ జనరిక్ వర్షన్ ‌ను అధిక ధరకు విక్రయిస్తున్న ఓ మెడికల్ షాప్ ఓనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని మీరా రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోనూ దర్శి(25) అనే వ్యక్తి రోడ్రిగ్స్ రౌల్(31) అనే వ్యక్తిని సహాయకుడిగా పెట్టుకుని మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. యాంటీ వైరల్ డ్రగ్‌ రెమిడిసివిర్‌ను అధిక ధరకు అమ్ముతూ పట్టుబడ్డాడు. ఈ ఇంజక్షన్ అసలు ధర రూ.5,400. కానీ.. 20,000 రూపాయలకు అమ్ముతుండగా అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా.. గిలీడ్ సైన్సెస్ కు చెందిన రెమిడిసివిర్ డ్రగ్‌ను ఫార్మా కంపెనీలు నేరుగా ఆసుపత్రులకే సప్లయ్ చేస్తున్నాయి. ఈ మెడికల్ షాప్ యజమానికి రెమిడిసివిర్ ఇంజక్షన్స్ ఎలా అందుబాటులోకి వచ్చాయో, ఈ బ్లాక్ మార్కెట్ వెనుక ఉన్నదెవరోనని కనిపెట్టే పనిలో పోలీసులు ఉన్నారు. నాలుగు వయల్స్ విక్రయిస్తుండగా ఈ మెడికల్ షాప్ ఓనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read: ఫలించిన చర్చలు.. స్వదేశానికి 367 మంది భారతీయులు..!