పక్కనవారు చనిపోతున్న పట్టించుకోకుండా వెళిపోయే రోజులివి. ఇలాంటి రోజుల్లో కూడా మంచివారు ఉన్నారు అంటే అందుకు ఈ దంపతులే ఉదాహరణ. తమ ఇంటి పనిమనిషికి బాగోలేదని.. స్వయంగా వారే టిఫెన్ అమ్మి ఆమెకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. ముంబైకి చెందిన అశ్వినీ, ఆమె భర్త ఎంబిఏ చదివారు. ఇద్దరు ప్రవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వాళ్ల ఇంట్లో పనిచేసే పనిమనిషి భర్త ఆనారోగ్యానికి గురయ్యాడు. అతడు పక్షవాతం వచ్చి మంచం పట్టాడు. అది తెలుసుకున్న అశ్వినీ దంపతులు.. పనిమనిషికి ఏదో విధంగా సాయం చేయాలనే ఉద్దేశంతో ఆమెతో టిఫిన్ సెంటర్ పెట్టించారు. ఆమె చేసిన వంటను వీరే స్వయంగా అమ్మి పెడుతున్నారు. రైల్వే స్టేషన్ సమీపంలో ఉదయం 4 గంటల నుంచి 9 గంటల వరకు టిఫెన్లు అమ్మి.. తరువాత వారి ఉద్యోగాలకు వెళిపోతున్నారు. వీరు చేస్తున్న సేవను గుర్తించి భాటియా అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ముంబైలో ఓ సారి రైల్వే స్టేషన్ పక్కన భాటియా టిఫెన్ చేయడానికి వెళ్లాడు. వాళ్లను చూసి ఉండలేక.. చూడటానికి ధనవంతుల్లా కనిపిస్తున్నారు. ఈ టిఫిన్ సెంటర్ మీదేనా..? అని అడిగారు. అప్పుడు వారు చెప్పిన సమాధానం విని అతడు ఆశ్చర్యపోయాడు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారంటూ.. వారి గురించి అందరికి తెలియాలని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.