కంగనా సిస్టర్స్ పై ఎంక్వయిరీకి ముంబై అంధేరీ కోర్టు ఆదేశం

ఒక సామాజికవర్గాన్ని, మతాన్ని రెచ్ఛగొట్టేట్టు సోషల్ మీడియాలో పోస్టులు  పెడుతున్నారంటూ దాఖలైన ఫిర్యాదును పురస్కరించుకుని ముంబైలోని అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు కంగనా పైన,

కంగనా సిస్టర్స్ పై ఎంక్వయిరీకి ముంబై అంధేరీ కోర్టు ఆదేశం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 29, 2020 | 10:12 PM

ఒక సామాజికవర్గాన్ని, మతాన్ని రెచ్ఛగొట్టేట్టు సోషల్ మీడియాలో పోస్టులు  పెడుతున్నారంటూ దాఖలైన ఫిర్యాదును పురస్కరించుకుని ముంబైలోని అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు కంగనా పైన, ఆమె సోదరి రంగోలీపైన ఎంక్వయిరీ జరిపించాలని  పోలీసులను ఆదేశించింది. అలీ కాసిఫ్ ఖాన్ దేశ్ ముఖ్ అనే అడ్వొకేట్ వేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు ఈ మేరకు ఆదేశించింది. మత సామరస్యాన్ని భంగ పరిచే విధంగా ఈ సిస్టర్స్ పోస్టులు ఉన్నాయని పిటిషనర్ ఆరోపించారు. పైగా బాలీవుడ్ ప్రతిష్టను కించ పరచే విధంగా పలు సందర్భాల్లో వీరు వ్యాఖ్యలు చేశారని కూడా ఆయన అన్నారు. కాగా ఈ పిటిషన్ పై మళ్ళీ డిసెంబరు 5 న విచారణ జరగాలని కోర్టు సూచించింది.