బ్రేకింగ్: పట్టాలు తప్పిన ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్.. 50 మందికి గాయాలు!

|

Jan 16, 2020 | 11:55 AM

ఒడిశాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ముంబై నుంచి భువనేశ్వర్ వెళ్తున్న లోకమాన్య తిలక్ టెర్మినస్(ఎల్‌టీటీ) ఎక్స్‌ప్రెస్ నెర్‌గుండి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఉదయం సుమారు 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పొగ మంచు కారణంగా ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్‌ వ్యాన్‌ను ఢీ కొట్టడంతో ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్ 6 బోగీలు పట్టాలు తప్పినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో 50 మందికి గాయాలు కాగా.. ఐదుగురి పరిస్థితి విషమంగా […]

బ్రేకింగ్: పట్టాలు తప్పిన ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్.. 50 మందికి గాయాలు!
Follow us on

ఒడిశాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ముంబై నుంచి భువనేశ్వర్ వెళ్తున్న లోకమాన్య తిలక్ టెర్మినస్(ఎల్‌టీటీ) ఎక్స్‌ప్రెస్ నెర్‌గుండి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఉదయం సుమారు 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పొగ మంచు కారణంగా ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్‌ వ్యాన్‌ను ఢీ కొట్టడంతో ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్ 6 బోగీలు పట్టాలు తప్పినట్లు అధికారులు చెబుతున్నారు.

ఈ ఘటనలో 50 మందికి గాయాలు కాగా.. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, ట్రైన్ వేగంగా రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు చెబుతున్నారు.