2020కి జియో 5జీ సేవలు

ముంబయి:టెలికాం రంగంలో జియో తీసుకొచ్చిన సంచలనాలు అన్నీ, ఇన్నీ కాదు. అనతి కాలంలోనే కష్టమర్స్ మనసు దోచుకున్న జీయో దెబ్బకు మిగతా టెలికాం కంపెనీలన్నీ బాచీ తన్నేశాయి. తాజాగా సంచలన జియో నెట్‌వర్క్‌ మరో అడుగు ముందుకేసింది. వొడాఫోన్‌, ఐడియా, ఎయిర్‌టెల్‌ల నుంచి ఎదురవుతున్న పోటీని ఎదుర్కోవడానికి వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో జియో 5జీ సేవలను ప్రారంభించడానికి కసరత్తులు మొదలు పెట్టింది. ఇప్పటివరకు మన దేశంలో 2జీ,3జీ, 4జీ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 4జీ కూడా […]

2020కి జియో 5జీ సేవలు

Updated on: Mar 16, 2019 | 11:47 AM

ముంబయి:టెలికాం రంగంలో జియో తీసుకొచ్చిన సంచలనాలు అన్నీ, ఇన్నీ కాదు. అనతి కాలంలోనే కష్టమర్స్ మనసు దోచుకున్న జీయో దెబ్బకు మిగతా టెలికాం కంపెనీలన్నీ బాచీ తన్నేశాయి. తాజాగా సంచలన జియో నెట్‌వర్క్‌ మరో అడుగు ముందుకేసింది. వొడాఫోన్‌, ఐడియా, ఎయిర్‌టెల్‌ల నుంచి ఎదురవుతున్న పోటీని ఎదుర్కోవడానికి వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో జియో 5జీ సేవలను ప్రారంభించడానికి కసరత్తులు మొదలు పెట్టింది. ఇప్పటివరకు మన దేశంలో 2జీ,3జీ, 4జీ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 4జీ కూడా రీసెంట్ టైమ్స్‌లో అందరికి అందుబాటులోకి వచ్చింది. తమను ఇంతలా ఆదరిస్తున్న కష్టమర్స్‌కి మరింత విలువైన సర్వీస్ అందించాలన్న ఆలోచనతోనే 5జీ నెట్‌వర్క్‌ను తీసుకురానున్నట్లు ముఖేష్ అంబానీ చెప్పారు. డేటా వాడకం ఎక్కువ ఉన్నప్పటికీ 5జీ ను ఉపయోగించేంత సాంకేతికత దేశంలో లేదు. ఈ క్రమంలో 5జీ మొబైళ్ల కంటే ముందు నెట్‌వర్క్‌ సేవలే మొదలవుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.