సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకునే నైజం భారత్ సొంతం..ఫేస్‌బుక్‌ సీఈఓతో ముకేష్ అంబానీ ఫేస్ టు ఫేస్..

|

Dec 15, 2020 | 7:16 PM

రాబోయే 20 ఏళ్లలో ప్రపంచంలోనే మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్​ నిలుస్తుందని రిలయన్స్​ అధినేత ముకేష్ అంబానీ జోష్యం చెప్పారు. ప్రజల తలసరి ఆదాయం కూడా రెట్టింపవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకునే నైజం భారత్ సొంతం..ఫేస్‌బుక్‌ సీఈఓతో ముకేష్ అంబానీ ఫేస్ టు ఫేస్..
Follow us on

Mukesh Ambani Speaks to Zuckerberg : రాబోయే 20 ఏళ్లలో ప్రపంచంలోనే మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్​ నిలుస్తుందని రిలయన్స్​ అధినేత ముకేష్ అంబానీ జోష్యం చెప్పారు. ప్రజల తలసరి ఆదాయం కూడా రెట్టింపవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

డిజిటల్ ఇండియా భాగస్వామ్యానికి సంబంధించి ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌తో జరిగిన ఆన్‌లైన్‌ ఫేస్ టు ఫేస్‌ కార్యక్రమంలో ముకేష్ అంబానీ మాట్లాడారు. సంక్షోభానికి, ఉపద్రవానికి కుంగిపోవడం భారత్ డీఎన్‌ఏలోనే లేదని.. సంక్షోభాన్ని కొత్త అధ్యాయానికి అవకాశంగా మలుచుకునే నైజం భారత్ సొంతం అని ముకేష్ అంబానీ వివరించారు.

అయితే.. కరోనా లాంటి ఉపద్రవం ఐదేళ్ల క్రితం భారత్ ఎదుర్కోవాల్సి వచ్చి ఉంటే.. పరిస్థితి ఊహించని విధంగా ఉండి ఉండేదని అంబానీ వ్యాఖ్యానించారు. ‘డిజిటల్ ఇండియా’ను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినందుకు మోదీ సర్కార్‌కు ముకేష్ అంబానీ ధన్యవాదాలు తెలిపారు.

ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కూడా స్పందించారు. గత నెలలో భారత్‌లో వాట్సాప్ పేను ఆవిష్కరించామని.. యూపీఐ విధానంతో పాటు 140 బ్యాంకుల వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. ఇలాంటివి చేయగలిగిన తొలి దేశం ఇండియానేనని మార్క్ జుకర్‌బర్గ్ చెప్పుకొచ్చారు.