AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధోనీకి ఇంటికి చేరిన అరుదైన గిఫ్ట్..

ధోనీ తన రిటైర్మెంట్‌ను ఘనంగా జరుపుకున్నట్లుగా సమాచారం. ఈ సందర్బంగా ఆయనకు ఓ అద్భతమై గిఫ్ట్ అతని ఇంటికి చేరింది. అది మాములు గిఫ్ట్ కాదు ఎంతో అరుదైన ... చాలా విలువైన...

ధోనీకి ఇంటికి చేరిన అరుదైన గిఫ్ట్..
Sanjay Kasula
|

Updated on: Aug 18, 2020 | 12:31 AM

Share

ధోనీ తన రిటైర్మెంట్ సంబరాన్ని ఘనంగా జరుపుకున్నట్లుగా సమాచారం. ఈ సందర్బంగా ఆయనకు ఓ అద్భతమై గిఫ్ట్ అతని ఇంటికి చేరింది. అది మాములు గిఫ్ట్ కాదు ఎంతో అరుదైన … చాలా విలువైన గిఫ్ట్. ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ధోనీ సతీమణి.

పోంటియాక్ ఫైర్‌బర్డ్ ట్రాన్స్ యామ్‌తో ధోని తన రిటైర్‌మెంట్‌ను గొప్పగా చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఎంఎస్ ధోని భార్య సాక్షి ధోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దానికి సంబంధిన ఫోటోలను, వీడియోను షేర్‌ చేశారు. డ్యూయల్ రేసింగ్ గీతలతో ఎరుపు రంగుతో ఉన్న ట్రాన్స్ యామ్ ధోని కార్‌ గ్యారేజీలో అద్భుతంగా కనిపిస్తోంది.

View this post on Instagram

Welcome home ! @mahi7781 missing you …#transam

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

ఈ కారును చూస్తే.. ఇది 1971-1973 మధ్య కాలంతో విడుదలైన మోడల్ గా అనిపిస్తోంది. పోంటియాక్ ఫైర్‌బర్డ్ ట్రాన్స్ యామ్ 1970 లలో తయారు చేసిన ఒక అమెరికన్ కారు. ఇది భారతదేశంలో దొరకడం చాలా అరుదు.స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఈ కారు ధోనీ ఇంటికి చేరింది. ఈ వీడియోలో ట్రాన్స్ యామ్ కాకుండా, ధోని గ్యారేజీలో ఉన్న మరిన్ని కార్లను కూడా చూడవచ్చు. ఇందులో హమ్మర్ హెచ్ 2, జీప్ గ్రాండ్ చెరోకీ ట్రాక్‌హాక్ అలాగే రోల్స్ రాయిస్ సిల్వర్ షాడో సిరీస్ 1, మిత్సుబిషి పజెరో ఎస్‌ఎఫ్‌ఎక్స్ , పాత తరం టయోటా కరోలాతో సహా మరిన్ని వాహనాలను కూడా చూడవచ్చు.

View this post on Instagram

Major Mahi missing @mahi7781 !

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on