బహిరంగసభలో మోకాళ్లపై కూర్చోని ప్రజలకు దండం పెట్టిన ముఖ్యమంత్రి..!

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచార వేదికపై మోకాళ్లపై వంగి దండం పెట్టిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. సీఎం చర్యను మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ విమర్శించగా, శివరాజ్ దీటుగా ప్రతిస్పందించారు.

బహిరంగసభలో మోకాళ్లపై కూర్చోని ప్రజలకు దండం పెట్టిన ముఖ్యమంత్రి..!

Updated on: Oct 10, 2020 | 9:33 PM

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచార వేదికపై మోకాళ్లపై వంగి దండం పెట్టిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. సీఎం చర్యను మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ విమర్శించగా, శివరాజ్ దీటుగా ప్రతిస్పందించారు. ఆ రాష్ట్రానికి చెందిన జోతిరాధిత్య సింధియాతోపాటు 28 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గత ఏడాది రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో కమల్‌నాథ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. వీరి రాజీనామాలతో ఖాళీ అయిన 28 స్థానాలకు నవంబర్ నెలలో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మాండ్‌సౌర్ జిల్లాలోని సువస్రా నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే హర్దీప్ సింగ్ డాంగ్‌ బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. ఆయనకు మద్దతుగా నిర్వహించిన ప్రచార సభలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ మోకాలిపై కూర్చొని ఓటర్లు, పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం కమల్ నాథ్ దీనిపై ట్వీట్టర్ వేదికగా సెటెర్లు వేశారు. ‘ఒక నేత అధికారం కోసం రాజకీయాలను అపహాస్యం చేయకుండా ఉండాలి. ప్రజలకు అబద్ధమాడకుండా, చేసిన వాగ్దానాలు నెరవేరిస్తే.. ఆ నేతను ప్రజలు గౌరవించి తప్పక గెలిపిస్తారు. దీని కోసం మోకరిల్లాల్సిన పని లేదు’ అంటూ శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ఉద్దేశించి శనివారం ట్విట్టర్‌లో విమర్శించారు.

ఇందుకు బీజేపీ సైతం దీటుగానే స్పందించింది. ‘కొంత మంది దేశ ప్రజల ముందు తలవంచితే, ఇతరులు ఇటలీకి, చైనాకు తలవంచుతారు’ అంటూ కాంగ్రెస్‌కు చురకలు వేసింది.