భారత్ లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తనపై దాఖలు చేసిన కేసులు, ఫిర్యాదులతో చిక్కుల్లో పడిన యోగాగురు బాబారాందేవ్ కి మరో ట్రబుల్ ఎదురైంది. . ఆయన ఆధ్వర్యంలోని పతంజలి సంస్థ గిఫ్ట్ గా ఇచ్చిన కొరొనిల్ మందు కిట్స్ పంపిణీని నేపాల్ ప్రభుత్వం నిలిపివేసింది. కోవిద్-19 వైరస్ సోకకుండా నిరోధక శక్తిని పెంచుతుందని ప్రచారంలో ఉన్న కొరొనిల్ ..1500 కిట్స్ ని సేకరించడంలో సరైన విధానాన్ని పాటించలేదంటూ ఖాట్మండూ లోని ఆయుర్వేద విభాగం తెలిపింది. ఈ కారణంగా పంపిణీని నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. పైగా కోవిద్ చికిత్సకు వాడే మందులతో పోలిస్తే.. కొరొనిల్ టాబ్లెట్లు, నాసల్ ఆయిల్ కూడా సరితూగజాలవని నేపాల్ ప్రభుత్వం వెల్లడించింది. ఇండియాలో రాందేవ్ పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పెట్టిన కేసులను కూడా అధికారులు గుర్తించారు. గత ఏడాది జూన్ 23 న రాందేవ్ తమ కొరొనిల్ మెడిసిన్ ని అట్టహాసంగా లాంచ్ చేశారు. కానీ దీని వినియోగంపై పలువురు సందేహాలు లేవనెత్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన విభాగం తమ మందును సర్టిఫై చేసిందని బాబా రాందేవ్ చెప్పుకున్నప్పటికీ తాము అలాంటి సర్టిఫికెట్ ను ఏ సంస్థకూ ఇవ్వలేదని ఆ విభాగం ఆ తరువాత స్పష్టం చేసింది.
ఇలా ఉండగా ఇటీవలే భూటాన్ కూడా కొరొనిల్ మెడిసిన్ పంపిణీని నిలిపివేసింది. భూటాన్ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ గతంలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు నేపాల్ రెండో దేశమైంది. కానీ ఈ కొరొనిల్ మందును తాము నిషేదించలేదని నేపాల్ ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. దీన్ని బ్యాన్ చేసినట్టు వచ్చిన వార్తలు నిజం కాదన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Syndicate Customers: సిండికేట్ బ్యాంక్ ఖాతాదారులకు హెచ్చరిక.. జూలై 1నుంచి అమల్లోకి సరికొత్త IFSC కోడ్ .. తెలుసుకోవడం ఎలా అంటే..
ఆగ్రాలో 22 మంది కోవిద్ రోగులపై ‘మాక్ డ్రిల్’…పేషంట్ల మృతి ఘటనతో కదిలిన అధికారులు.. ఆసుపత్రి సీల్