రుతుపవనాల రాక మరింత ఆలస్యం కావొచ్చని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇంతకు ముందు చెప్పినట్లుగా జూన్ 2న కాకుండా.. జూన్ 6 నాటికి కేరళను తాకే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం రుతుపవనాలు అరేబియా సముద్రం, బంగాళాఖాతం, అండమాన్, నికోబార్ దీవుల్లో విస్తరించాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న రెండు మూడు రోజుల్లో రుతుపవనాలు అరేబియా సముద్రంలోని అత్యధిక భాగానికి విస్తరిస్తాయని తెలిపింది.